ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్‌షిప్ మారనుంది. ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్ల కారణంగా VIVO 2020 స్పాన్సర్‌షిప్ కమిట్మెంట్ నుంచి డ్రాప్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్‌ను కరోనావైరస్ సంక్షోభం కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనున్నారు.
2021, 2022, 2023 సీజన్లకు వీవో కాంట్రాక్ట్ పొడిగించాల్సి ఉంది. చైనీస్ మొబైల్ ఫోన్ మేకర్ వీవో టైటిల్ స్పాన్సర్ గా సంవత్సరానికి రూ.440కోట్లు చెల్లించేది. 2017లో కుదుర్చుకున్న ఒప్పందం ఐదేళ్లకుగానూ కుదుర్చుకున్నారు. మొత్తం ఈ ఒప్పందం విలువ రూ.2వేల 199కోట్లు.
మరో 3రోజుల్లో బీసీసీఐ కొత్త స్పాన్సర్‌షిప్ కు బీసీసీఐ టెండర్ వేయనుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) సోమవారం చైనీస్ మొబైల్ కంపెనీతో టైటిల్ స్పాన్సర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ కేవలం వీవో మాత్రమే కాకుండా పేటీఎం, స్విగ్గీ, డ్రీమ్ ఎలెవన్ లు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి.