తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని.. భారీ స్కోరుతో చెలరేగి రాజస్థాన్ చేరుకోలేదని భావించిన టార్గెట్ ను రాజస్థాన్ ఊదేసింది. IPL 2020లో కనీవినీ ఎరుగని మ్యాచ్. స్మిత్, శాంసన్, తేవాటియాలు మెరుపు వేగంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. ఈ సీజన్ లో అద్భుతమైన విజయమంటే ఇదే. పంజాబ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ చేసిన సెంచరీకి మించిన స్కోరుతో 223 పరుగులు చేయగలిగింది.
చేధనలో పంజాబ్ పై ప్రతాపం చూపించి రెచ్చిపోయింది రాజస్థాన్. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) పునాది వేయగా… ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ శాంసన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు. వీరిద్దరి శ్రమకు రాహుల్ తేవాటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలనాన్ని జతచేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కు మరో విజయం ఖరారైంది.
మయాంక్ అగర్వాల్ (50 బంతుల్లో 106; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ బాదగా, కెప్టెన్ రాహుల్ (54 బంతుల్లో 69; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసి 4వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్తాన్ జట్టులో మిల్లర్, యశస్వి జైస్వాల్ స్థానాల్లో బట్లర్, అంకిత్ రాజ్‌పుత్‌లను తుది జట్టులోకి తీసుకుంది.
రాయల్స్ చేజింగ్
ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్లిన స్మిత్ ఔటయ్యాడు. కొనసాగించిన శాంసన్ నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న తేవటియా అగచాట్లు పడుతున్నాడు. 17 ఓవర్ల వద్ద రాజస్తాన్ స్కోరు 173/3. మిగిలినవి 18 బంతులే. చేయాల్సినవి 51 పరుగులు. ఆఖరి 3 ఓవర్లలో 17 పరుగుల చొప్పున చేయాలి. అప్పుడు సాగింది కాట్రెల్ బౌలింగ్… తేవటియా బ్యాటింగ్… 6, 6, 6, 6, 0, 6 లాంగ్‌లెగ్, బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్, మిడ్ వికెట్, బంతి గ్యాప్ తర్వాత మళ్లీ మిడ్ వికెట్‌ల మీదుగా మొత్తం 5 సిక్స్‌లు. అంతే సమీకరణం మారింది.
మయాంక్ సూపర్ సెంచరీ
అంతకుముందు రాహుల్‌తో పరుగులు మొదలుపెట్టిన మయాంక్ తానెదుర్కొన్న నాలుగో బంతి (1.3 ఓవర్)తో విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. మిడాఫ్‌లో భారీ సిక్సర్ బాదిన ఈ ఓపెనర్ ఇక అక్కడినుంచి వెనుతిరిగి చూసుకోనేలేదు. 26 బంతుల్లో (4 ఫోర్లు, 5 సిక్సర్లు) మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. కొంచెం ఆలస్యమైనా రాహుల్ 35 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ అధిగమించాడు. 45 బంతుల్లోనే (9 ఫోర్లు, 7 సిక్సర్లు) మయాంక్ శతక్కొట్టాడు. ఆ తర్వాతే టామ్ కరన్ వికెట్ తీయడంతో 183 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.