క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. యూఏఈ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 లీగ్ స్టేజ్‌కు పూర్తి స్థాయి షెడ్యూల్ నుఐపీఎల్ గవర్నింగ్ కమిటీ ఆదివారం ప్రకటించింది. 46 రోజుల పాటు… యూఏఈలోని షార్జా, దుబాయ్, అబుదాబి నగరాలు వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. దుబాయిలో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 సాయంత్రం 07.30కి అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. సెప్టెంబర్-20న ఢిల్లీ క్యాపిటల్స్ -కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య రెండవ మ్యాచ్ జరగనుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో ఆడనుంది. ఆ మ్యాచ్ సెప్టెంబర్ 21న రాత్రి 07.30కి దుబాయ్‌లో జరుగుతుంది.
ప్రస్తుతానికి లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తారు.