రూ.7 కోట్లకు మొయిన్ అలీని దక్కించుకున్న చెన్నై

IPL 2021 Auction: Moeen Ali sold to CSK : 2021 ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీని రూ.7 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. గత నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలీని రిలీజ్ చేసింది. ఈసారి సీజన్ కోసం అలీని చెన్నై సొంతం చేసుకుంది.

మొయిన్ అలీ కోసం చెన్నైతో పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా పోటీ పడింది. అయితే చివరికి మొయిన్ అలీ చెన్నై సొంతం చేసుకుంది. ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టులోకి అలీకి చోటు దక్కింది. మొయిన్ కోసం మిగతా ఫ్రాంచైజీలు సైతం పోటీపడ్డాయి.

https://10tv.in/ipl-auction-morris-sold-to-royals-for-rs-16-25-crore/