Hockey Asia Cup 2025: ఫైనల్ లో భారత్ సంచలన విజయం.. 8ఏళ్ల తర్వాత.. ఆసియా కప్ హాకీ టైటిల్ కైవసం..
ఫైనల్ మ్యాచ్ లో వరుస విరామాల్లో గోల్స్ సాధించిన ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది భారత్.

Hockey Asia Cup 2025: ఆసియా హాకీ కప్ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. సంచలన విజయం నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ లో 4-1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ను సౌత్ కొరియాను ఓడించింది. ఈ గెలుపుతో ఆసియా కప్ హాకీ టైటిల్ కైవసం చేసుకుంది. 8 ఏళ్ల తర్వాత ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. భారత్ కు ఇది నాలుగో టైటిల్. ఈ విజయంతో 2026 హాకీ వరల్డ్‌కప్ కు అర్హత సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో వరుస విరామాల్లో గోల్స్ సాధించిన ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది భారత్.
దిల్‌ప్రీత్ సింగ్ ఫైనల్ మ్యాచ్ లో హీరోగా నిలిచాడు. రెండో క్వార్టర్‌లో ఒక గోల్, మూడో క్వార్టర్‌లో మరో గోల్ చేశాడు. రెండు గోల్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణ కొరియా గోల్స్ కోసం పలుమార్లు ప్రయత్నించినా భారత గోల్‌కీపర్ అద్భుతమైన సేవ్‌లు చేసి వారి ప్రయత్నాలను విఫలం చేశాడు.
ఈ గెలుపుతో ఆసియా హాకీ చరిత్రలో భారత్ రికార్డ్ సృష్టించింది. 2017 తర్వాత మళ్లీ ఈ టైటిల్‌ను గెలిచింది. 2026 వరల్డ్ కప్ కోసం భారత్ సిద్ధం కానుంది.
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ జైత్రయాత్ర కొనసాగించింది. ఫైనల్ లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం రాజ్‌గిర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో 4-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను చిత్తు చేసింది. హాకీలో అత్యంత విజయవంతమైన జట్టు కొరియాపై ఆధిపత్యం చెలాయించింది. ఇండియా దూకుడుతో ఫైనల్ పోరు ఏకపక్షమైంది.