IPL 2021 PBKS Vs MI.. ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 136

IPL 2021 PBKS Vs MI.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


ముంబయి జట్టులో సౌరబ్ తివారి 45, డికాక్ 27, హార్ధిక్ పాండ్యా 40 రాణించారు. ఆఖర్లో పొలార్డ్ 15 మెరుపులు మెరిపించాడు. ఈ గెలుపుతో ముంబై ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండగా, పంజాబ్ కు మార్గం సంక్లిష్టంగా మారింది.

Bamboo Plants : ఎకరం భూమి.. ఏడేళ్లలో రూ.17లక్షల ఆదాయం.. ఆ రైతు ఏం పండించాడంటే

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. అయిడెన్ మార్ క్రమ్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. దీపక్ హుడా 28, కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 పరుగులు చేశారు. గేల్ (1), నికొలాస్ పూరన్ (2) నిరాశపరిచారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 2, పొలార్డ్, రాహుల్ చహర్ 1, కృనాల్ పాండ్య 1 వికెట్ తీశారు.

Bank Customers : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి తడబడింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (8), సూర్యకుమార్ యాదవ్ (0)లను లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఆ తర్వాత సౌరబ్ తివారీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ట్రెండింగ్ వార్తలు