IPL 2021: బుమ్రా ఫాస్ట్ బౌలింగే కాదు.. ఫొటోలు కూడా హాట్‌గా తీయగలడు!!

ముంబై ఇండియన్స్ ప్లేయర్ బుమ్రా భార్యతో యూఏఈలో ఉన్నాడు. పనితో పాటు అరబిక్ అందాల్లో ప్రశాంతత వెదుక్కుంటున్నాడు.

IPL 2021: టీమిండియా ఫేసర్.. ముంబై ఇండియన్స్ ప్లేయర్ బుమ్రా భార్యతో యూఏఈలో ఉన్నాడు. పనితో పాటు అరబిక్ అందాల్లో ప్రశాంతత వెదుక్కుంటున్నాడు. అతని భార్య స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన తోడుగా క్వాలిటీ లైంను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సరదా మూమెంట్స్ లోనే సోమవారం బీచ్ లో ఎంజాయ్ చేశారట.

ఈవెనింగ్ సన్ ను ఎంజాయ్ చేస్తున్నామంటూ తాను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది సంజన. మాజీ మోడల్ ఫొటోను క్లిక్ మనిపించింది ఎవరో కాదు తన భర్త కమ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన బుమ్రానే. దీని కింద కామెంట్ కూడా రాసుకొచ్చారు సంజనా.

…………………………………………: మోదీకి ప్రియాంక గాంధీ.. లఖిమ్‌పూర్ వీడియో చూపిస్తూ సూటి ప్రశ్న

‘ఫొటోను క్లిక్‌మనిపించింది నా బెస్ట్ ఫ్రెండ్ జస్ప్రిత్ బుమ్రా’ అని పోస్టు పెట్టింది. ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఎంత అందం అంటూ పొగిడేస్తూనే.. బుమ్రా తన భార్యకు ఎప్పుడూ క్రెడిట్ ఇవ్వలేదని సంజనా మాత్రం అలా కాదని కామెంట్ చేస్తున్నారు. ఈ పోస్టు కంటే ముందు తన భర్త ముంబై ఇండియన్స్ తరపున ఆడటానికి గేమ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడని చెప్పారు.

‘బుమ్రా అన్ని రోజులు పట్టించుకోకపోయినా.. మ్యాచ్ రోజు మాత్రం బ్రేక్ ఫాస్ట్, లంచ్ లాంటి వాటిని కచ్చితంగా పాటిస్తాడు. బస్ ఎక్కేంత వరకూ అన్నీ ఫాలో అవుతాడు. మిగిలిన రోజుల్లో బ్రేక్ ఫాస్ట్ ను మధ్యాహ్నం రెండు గంటలకు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి’ అని సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది.

ట్రెండింగ్ వార్తలు