ILT20 : క్రికెట్ అభిమానులకు పండుగే.. నవంబర్ 21 నుంచి ఐఎల్టీ20 సీజన్-5 షురూ.. ఫైనల్ ఎక్కడంటే?
ILT20 : క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టీ20 టోర్నీ సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆసక్తి రేపుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్టీ20)- 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది.
ILT20
ILT20 : క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టీ20 టోర్నీ సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆసక్తి రేపుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్టీ20)- 2026 సీజన్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది. యూఏఈ వేదికగా జరిగే ఐదో సీజన్ నవంబర్ 21న ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఐఎల్టీ20 టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే గత సీజన్ ఫైనల్ రిపీట్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ డెజర్ట్ వైపర్స్, సీజన్-2 ఛాంపియన్ ఎంఐ ఎమిరేట్స్‌తో తలపడనుంది. నవంబర్ 21న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు లీగ్ దశలో 10 మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. డిసెంబర్ 20న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ జరగనుంది.
ఈ టోర్నీలో డెజర్ట్ వైపర్స్, అబుదాబి నైట్‌రైడర్స్, దుబాయ్ క్యాపిటల్స్, గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ బరిలోకి దిగనున్నాయి. ఈ టోర్నీలో మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకు లేదా రాత్రి 8గంటలకు ప్రారంభం కానున్నాయి.
