IPL 2022 : సన్ రైజర్స్ వరుస విక్టరీలు.. కావ్యా మారన్‌.. లాఫింగ్ టైమ్.. ట్విట్టర్‌లో కామెంట్లు..!

IPL 2022 :  ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గత సీజన్‌లో ఓటములతో నిరాశపరిచిన SRH జట్టు.. ఈ సీజన్‌లో పుంజుకుంది.

IPL 2022 :  ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గత సీజన్‌లో ఓటములతో నిరాశపరిచిన SRH జట్టు.. ఈ సీజన్‌లో పుంజుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. SRH కెప్టెన్ రాహుల్ త్రిపాఠి వీరోచిత ఇన్నింగ్స్‌ (71)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది. వాస్తవానికి ఐపీఎల్ సీజన్‌లో SRH కు ఎప్పటికి గుర్తుండి పోయే రోజు.. త్రిపాఠి మెరుపులతో SRH యజమాని కావ్య మారన్ మరోసారి స్టేడియంలో నవ్వుతూ కనిపించారు. గత సీజన్‌లో బాధగా కనిపించినా కావ్య మారన్.. ఈ సీజన్‌లో ఆమె నవ్వుతూనే కనిపిస్తోంది. ఆమె నవ్వడం చూసిన ఐపీఎల్ అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో SRH విజయం సాధించిన సమయంలో కావ్య నవ్వినందుకు అభిమానులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.


ఇంతకీ కావ్యా మారన్.. అనగానే.. ఐపీఎల్ ఫాలో అయ్యేవారికి టక్కున గుర్తుచ్చేది.. ఐపీఎల్ ప్రాంఛైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని.. సన్ రైజర్స్ అధినేత కళానిధి మారన్ కుమార్తెగా కావ్యా మారన్ సుపరిచితమే.. ఐపీఎల్‌ 2021 సీజన్‌ వరకు SRH జట్టు యజమానిగా కావ్యా మారన్ పేరు విషయం పెద్దగా తెలియకపోవచ్చు. 2021 ఐపీఎల్ సీజన్‌లో SRH అత్యంత చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో దిగువన నిలిచింది. ఆ సీజన్‌లో SRH ఓడిన ప్రతీసారి జట్టు కన్నా కావ్యా మారన్‌ ఎక్కువగా ట్రోల్ అయ్యారు. ఎందుకంటే… SRH మ్యాచ్ ఉన్న ప్రతిసారి ఆమె స్టేడియం గ్యాలరీలో కచ్చితంగా కనిపించేవారు. తన జట్టులో ఉత్సాహాన్ని నింపేందుకు ఆమె అక్కడే ఉండి ప్రోత్సహించేది. అయితే.. ఆ సీజన్‌లో SRH పెద్దగా మెరుపులు కనిపించలేదు. పైగా అన్ని ఓటములే ఎక్కువ.. ఇంకేమంది.. కావ్యా మారన్ ముఖంలో చిరునవ్వు లేదు.. బాధగా కనిపించింది. అప్పట్లో ఆమెను చూసి ట్విట్టర్ వేదికగా నెటిజన్లు భారీగా ట్రోల్స్ చేశారు.


కావ్యా మారన్ నవ్వితే ఒకసారి చూడాలని ఉందంటూ కామెంట్లు చేశారు. గత ఐపీఎల్ సీజన్‌లో SRH మెరుపులు ఒకటో రెండు మ్యాచ్ ల్లో మాత్రమే కావ్యా మారన్ నవ్వుతూ కనిపించారు. ఆ తర్వాత ఆమె నవ్వు కనిపించలేదు. ఈ ఏడాది 2022 ఐపీఎల్ ప్రారంభంలో కూడా SRH వరుసుగా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. ఈ ఏడాది కూడా కావ్యా మారన్ నవ్వకుండానే సీజన్ ముగుస్తుందేమోనని అనుకున్నారంతా.. కానీ, SRH ఎవరూ ఊహించని రీతిలో పుంజుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో SRH విజయం సాధించింది.


పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం SRH దూకుడు చూస్తుంటే టైటిల్ విన్నర్ కావడం ఖాయమే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకేముంది SRH యజమాని కావ్యా మారన్ నవ్వు ఆగదులే అన్నట్టుగా ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

గత ఫిబ్రవరిలో IPL మెగావేలం అనంతరం SRH ఆటగాళ్ల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. కావ్యా మారన్‌‌తో పాటు SRH ప్రాంఛైజీలో ఇతర అధికారులపై కూడా భారీ ట్రోల్స్ చేశారు నెటిజన్లు. ఇప్పుడు ఈ సీజన్ లో SRH వరుస విజయాలతో కావ్యా మెరన్ నవ్వేలే చేసినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె నవ్వుతున్న ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

Read Also : IPL2022 SRH Vs PBKS : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 4వ విజయంతో టాప్‌-4లో చోటు

ట్రెండింగ్ వార్తలు