IPL2022 SRH Vs PBKS : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 4వ విజయంతో టాప్‌-4లో చోటు

ఐపీఎల్ 2022 సీజన్ 15లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ వరుసగా 4వ విజయం నమోదు చేసింది.

IPL2022 SRH Vs PBKS : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 4వ విజయంతో టాప్‌-4లో చోటు

Ipl2022 Srh Vs Pbks

IPL2022 SRH Vs PBKS : ఐపీఎల్ 2022 సీజన్ 15లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ వరుసగా 4వ విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో హైదరాబాద్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది హైదరాబాద్. తొలుత బౌలర్లు రాణించగా, తర్వాత బ్యాటర్లు మెరిశారు. దీంతో.. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 152 పరుగుల టార్గెట్ ను మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది.

హైదరాబాద్ బ్యాటర్లలో మార్ క్రమ్ (27 బంతుల్లో 41 పరుగులు*), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 35 పరుగులు*), రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 34 పరుగులు), అభిషేక్ శర్మ (25 బంతుల్లో 31 పరుగులు) రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడా ఒక వికెట్ తీశాడు.(IPL2022 SRH Vs PBKS)

Rishabh Pant: “ఫస్ట్ గేమ్ కే అతణ్ని నిందించడం కరెక్ట్ కాదు”

తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 151 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని హైదరాబాద్‌ 3 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ విలియమ్సన్‌ (3) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరినా.. అభిషేక్‌ శర్మ (31), రాహుల్‌ త్రిపాఠి (34) రాణించారు. మార్‌క్రమ్‌ (41*), పూరన్‌ (35*) నాటౌట్‌గా నిలిచారు. టోర్నీలో హైదరాబాద్‌కు ఇది వరుసగా నాలుగో విజయం. వరుసగా నాలుగో విజయంతో హైదరాబాద్‌ (8) పాయింట్ల పట్టికలో టాప్‌-4లోకి దూసుకెళ్లింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో విజృంభించాడు. చివరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ కశ్మీరీ యువకెరటం హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. కాగా, ఆ ఓవర్లో ఓ రనౌట్ కూడా ఉండడంతో పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. మొత్తమ్మీద పంజాబ్ 20 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ (8) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ (14), జానీ బెయిర్ స్టో (12) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.

Rohit Sharma: బాధ్యత అంతా నాదే.. ఆరో ఓటమి తర్వాత రోహిత్ శర్మ స్పందన

అయితే, లియామ్ లివింగ్ స్టోన్ మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ భారీ స్కోరు దిశగా పయనిస్తున్నట్టే కనిపించింది. లివింగ్ స్టోన్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. అతడికి షారుఖ్ ఖాన్ (26) నుంచి సహకారం లభించింది. అయితే, షారుఖ్ ఖాన్, లివింగ్ స్టోన్ లను ఔట్ చేయడం ద్వారా భువనేశ్వర్ పంజాబ్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం వేశాడు.

ఆ తర్వాత బౌలింగ్ కు దిగిన ఉమ్రాన్ మాలిక్ పంజాబ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చివరి ఓవర్ బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్లో పంజాబ్ ఒక్క పరుగు కూడా సాధించలేకపోయింది. ఓడియన్ స్మిత్ (13), రాహుల్ చహర్ (0), వైభవ్ అరోరా (0)లను ఔట్ చేసిన మాలిక్ సన్ రైజర్స్ శిబిరంలో ఆనందం నింపాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అర్షదీప్ సింగ్ రనౌట్ కావడంతో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది.

ఈ సీజన్ లో హైదరాబాద్ మాంచి జోరుమీదుంది. ఆరంభంలో రెండు ఓటముల తర్వాత వరుసగా మూడు విజయాలు సాధించింది. ఇప్పుడు పంజాబ్ పై నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు పంజాబ్‌ 6 మ్యాచులు ఆడగా.. అందులో 3 విజయాలు, 3 ఓటములు ఉన్నాయి.

హైదరాబాద్‌ : అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్‌, జగదీశ్‌ సుచరిత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్సన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, టి.నటరాజన్‌

పంజాబ్‌ ‌: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, ఒడియన్‌ స్మిత్‌, కగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌, వైభవ్‌ ఆరోరా, అర్ష్‌దీప్‌ సింగ్‌