Rohit Sharma: బాధ్యత అంతా నాదే.. ఆరో ఓటమి తర్వాత రోహిత్ శర్మ స్పందన

ముంబై ఇండియన్స్ వరుసగా ఆరో ఓటమి. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క సారి కూడా గెలవకుండా పరాజయాలతో పోరాడుతుంది. ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత తానే వహిస్తానని అంటున్నా ముంబై..

Rohit Sharma: బాధ్యత అంతా నాదే.. ఆరో ఓటమి తర్వాత రోహిత్ శర్మ స్పందన

Mumbai Indians (2)

Rohit Sharma: ముంబై ఇండియన్స్ వరుసగా ఆరో ఓటమి. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క సారి కూడా గెలవకుండా పరాజయాలతో పోరాడుతుంది. ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత తానే వహిస్తానని అంటున్నా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఈ సీజన్ లో మొత్తం చేసిన స్కోరు 114పరుగులు కాగా అత్యధిక స్కోరు 41మాత్రమే.

“తప్పేంటో తెలిస్తే సరిచేసేవాడినే. కానీ అది బయటపడటం లేదు. ప్రతి గేమ్ ఆడటానికి నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. అందులో తేడా లేదు. కాకపోతే సమస్య బయటకు రావడం లేదు” అని రోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్ తో 18పరుగులతో ఓడిపోయిన అనంతరం వెల్లడించాడు.

“టీం నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగా ఆ స్థితిలో ఉంచలేకపోయినందుకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా. ఇన్నేళ్లుగా ఆడుతున్నట్లుగానే మళ్లీ నాకు నేనే సపోర్ట్ చేసుకుని ఆడుతున్నా. ముందుకు వెళ్లడమనేది చాలా ముఖ్యం. ఇక్కడితో ప్రపంచం ముగిసిపోలేదు. మళ్లీ పుంజుకుని తిరిగొస్తాం” అని రోహిత్ పేర్కొన్నాడు.

Read Also: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లేనా..

రోహిత్ శర్మను నాలుగో ఓవర్లో దింపడం వెనుక కారణం.. అడిగితే “ప్రత్యేకించి కారణం ఏం లేదు. కీలక బౌలర్లను సపోర్ట్ కోసం వెనక్కు పెట్టుకోవాలి. అలాగే బుమ్రాతో ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. అతను బాగానే బౌలింగ్ చేశాడు. ప్రతి గేమ్ మాకొక అవకాశమే. పరిస్థితులకు తగ్గట్లు ఆడటానికి ఎవరు బెస్ట్ అనేది ఆలోచించి తుది జట్టును సెలక్ట్ చేస్తాం”

“ఇప్పటివరకూ ఆరు గేమ్ లు ఓడిపోయాం. రైట్ కాంబినేషన్ గురించి అర్థం చేసుకుంటున్నాం. అదంతా మేం ఆడే ప్రత్యర్థి జట్టుపై ఆధారపడి ఉంటుంది. మా ఓటమి గురించి ఆలోచిస్తే తప్పులు, మార్పుల గురించి క్లారిటీ వస్తుంది. కానీ, మేం బెస్ట్ ఎలెవన్ గురించి ట్రై చేస్తున్నాం” అని చెప్తూనే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రదర్శనను పొగిడాడు.