IPL 2022: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లేనా.. | IPL 2022: is the Mumbai Indians performance over?

IPL 2022: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లేనా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో షరా మామూలుగా ముంబై ఇండియన్స్ కాస్త లేట్ గానే హిట్టింగ్ మొదలుపెడుతుంది. కానీ, ఈ సారి ఊహించిన దాని కంటే దారుణ వైఫల్యాలను ఎదుర్కొంటోంది.

IPL 2022: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లేనా..

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో షరా మామూలుగా ముంబై ఇండియన్స్ కాస్త లేట్ గానే హిట్టింగ్ మొదలుపెడుతుంది. కానీ, ఈ సారి ఊహించిన దాని కంటే దారుణ వైఫల్యాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుత సీజన్ దాదాపు 2014 సీజన్ ను మరిపిస్తుందంటే ఆశ్చర్యం లేదు. 2014లోనూ ఇలాగే వరుసగా 5 ఓటములు ఎదుర్కొంది.

మెగా సీజన్లో 10 జట్లతో పోటీపడి నెగ్గుకురావడం గతం మాదిరి సునాయాసం కాదు. 2014లో ఏడు గెలిచి ప్లే ఆఫ్ కు చేరింది. అప్పటిలాగే మరోసారి అదే మ్యాజిక్ చూపించగలదా.. మరో బ్యాక్ సత్తా చాటి బరిలో నిలుస్తుందా..

పంజాబ్ కింగ్స్ తో ఓటమి అనంతరం హెడ్ కోచ్ మహేలా జయవర్దనె … జోఫ్ఱా ఆర్చర్ లోటు కనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు.

“వేలంలో బెస్ట్ బౌలర్స్ ను కొనుగోలు చేసింది వాస్తవమే. జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేడు. ప్రస్తుతమున్న పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. వాటిని మేనేజ్ చేయడం అంత సులువేం కాదు ” అని శ్రీలంక ప్లేయర్ అన్నాడు.

Read Also: దేవుడొచ్చాడు.. ట్వీట్ చేసిన ముంబై ఇండియన్స్

గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకున్న ఆర్చర్.. లోటుతో జట్టు కుదేలైన మాట వాస్తవమే. అందుబాటులో ఉణ్న డేనేయల్ శామ్స్, టైమల్ మిల్స్ దారుణమైన ఎకానమీ రేటుతో నీరుగారుస్తున్నారు. బసిల్ థంపీ, జయదేవ్ ఉనదక్త్ లపైనే ఆశలు పెట్టుకున్న జట్టుకు నిరాశే మిగులుతుంది.

అసలు ముంబై బలమేంటి:
ముంబై లైనప్ లో కాస్త మార్పులు చేయాల్సి ఉంది. బెంచ్ కు మాత్రమే పరిమితమవుతున్న ప్లేయర్లను ఆడిస్తే పరిస్థితి మారొచ్చు. ఫేబియన్ అలెన్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్ మాత్రమే కాకుండా.. స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. వరల్డ్ క్రికెట్ లోనే బెస్ట్ ఫీల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. పొలార్డ్ ప్రస్తుత సీజన్ లో రాణించలేడని అనుకుంటే అతని స్థానంలో అలెన్ ను తీసుకోవడం బెటర్.

ఇక రెండో మార్పు టిమ్ డేవిడ్ మంచి పవర్ హిట్టర్. టీ20 ఫార్మాట్ లో స్పిన్నర్లకు ధీటైన జవాబు ఇచ్చిన రికార్డులు ఉన్నాయి.

Read Also : రోహిత్ శర్మకు జరిమానా.. హిట్ మ్యాన్ చేసిన తప్పు ఇదే..!

ముంబై చేయగలిగింది:
ఇంకా ముంబై కోల్పోయేదంటూ ఏమీ లేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాదిరిగా ప్లేయర్లు ఫామ్ లోకి వచ్చేంతవరకూ ఎదురుచూడటమా లేదంటే.. ప్లేయర్లను రీప్లేస్ చేసుకోవాలి.

జట్టుపై నమ్మకముంచి ముందుకెళ్లడంతో పాటు కొన్నేళ్ల క్రితం మిడిలార్డర్ లో పేలవ ప్రదర్శన చేస్తున్న ప్లేయర్లను రీప్లేస్ చేయాలి. సూర్య కుమార్ యాదవ్ .. తిలక్ వర్మ, బ్రూవీస్ ల కంటే ఎక్కువగా ఆడుతున్నాడు. అతని స్థానంలో అలెన్, టిమ్ డేవిడ్ లలో ఒక్కరిని తీసుకోవడం బెటర్.

ఓవరాల్ గా ముంబై జట్టులో బెస్ట్ ఎలెవన్ ను పిక్ చేసుకోవాలి. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాలి. పరుగులు అదనంగా ఇచ్చేస్తున్న బుమ్రాపై ఫోకస్ పెట్టాలి.

 

×