IPL 2022: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్

మరికొద్ది వారాల్లో ఆరంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022వ సీజన్ కు ముస్తాబవుతున్నాయి ఫ్రాంచైజీలు. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ తమ ఫ్రాంచైజీ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక....

Mayank Agarwal

IPL 2022: మరికొద్ది వారాల్లో ఆరంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022వ సీజన్ కు ముస్తాబవుతున్నాయి ఫ్రాంచైజీలు. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ తమ ఫ్రాంచైజీ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసింది. ముందుగా ఊహించినట్లుగానే చేసినప్పటికీ ఫిబ్రవరి 28న అధికారిక అనౌన్స్‌మెంట్ చేసింది.

గతంలో కేఎల్ రాహుల్ కు డిప్యూటీగా పనిచేసిన మయాంక్ కెప్టెన్ అయిపోయాడు. రాహుల్ ను వేలంలోకి విడిచిపెట్టి తిరిగి దక్కించుకోలేకపోవడంతో ఖాళీగా ఉండిపోయిన స్థానాన్ని భర్తీ చేశాడు.

పంజాబ్ కింగ్స్ అంటిపెట్టుకున్న ఇద్దరు ప్లేయర్లలో ఒకడు మయాంక్. 2011వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించిన మయాంక్, రైజింగ్ సూపర్ జెయిట్స్ కు కూడా ఆడాడు. ఐపీఎల్ కెరీర్ లో వందకు పైగా మ్యాచ్ లు ఆడి 2వేల 135పరుగులు చేశాడు.

Read Also: ఐపీఎల్ 2022 ఫ్రాంచైజీల మొత్తం లోగోలు

‘2018 నుంచి జట్టుతో ఉన్నా. కెప్టెన్సీ వహించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ.. బాధ్యతను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తా. పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ టాలెంట్ తో నా పని ఈజీ అవుతుందని భావిస్తున్నా. సత్తాతో నిండిన యువ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకునే దిశగా కష్టపడతాం. నాపై నమ్మకం ఉంచినందుకు టీమ్ మేనేజ్మెంట్ కు థ్యాంక్స్’ అని వెల్లడించాడు మయాంక్.