IPL Auction: డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం.. పోటీలో 991 మంది ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా ప్లేయర్సే టాప్

ఐపీఎల్-2023 కోసం త్వరలో మినీ వేలం జరగనుంది. ఈ నెల 23న కేరళలోని కోచిలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్‌లోని పది జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి.

IPL Auction: ఐపీఎల్-2023 సీజన్ కోసం త్వరలో మినీ వేలం జరగబోతుంది. ఈ నెల 23న కేరళలోని కోచిలో ఈ వేలం నిర్వహించబోతుంది బీసీసీఐ. ఈ వేలం కోసం 991 మంది దేశ, విదేశీ ఆటగాళ్లు పోటీ పడబోతున్నారు. వీరిలో దేశీయ ప్లేయర్స్ 714 మంది ఉండగా, 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

Akhilesh Yadav: 100 మంది ఎమ్మెల్యేలను తీసుకురండి.. సీఎం అవ్వండి.. యూపీ డిప్యూటీ సీఎంలకు అఖిలేష్ ఆఫర్

ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ కోసం స్వచ్ఛందంగా రిజిష్టర్ చేసుకోవచ్చు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎక్కువగా పోటీపడుతున్నారు. ఈ దేశం నుంచి 57 మంది ఐపీఎల్ కోసం రిజిష్టర్ చేసుకున్నారు. తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 52 మంది, వెస్టిండీస్ నుంచి 33 మంది, ఇంగ్లాండ్ నుంచి 31 మంది పొటీ పడనున్నారు. దేశం నుంచి కనీస ధర నిర్ణయించిన 19 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో 10 జట్లు పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ జట్లు ఇటీవల కొందరు ఆటగాళ్లను వదులుకున్నాయి. వాళ్లతోపాటు, కొత్తవాళ్లతో కలిసి ఈ మినీ వేలం జరుగుతుంది.

ఈ ఐపీఎల్ వేలంలో పాల్గొనే జట్లు తమ దగ్గర మిగిలి ఉన్న డబ్బుకు సరిపడా ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ టీమ్స్‌కు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధికంగా రూ.42.25 కోట్ల ధనం కలిగి ఉంది.

 

 

ట్రెండింగ్ వార్తలు