IPL2023: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్.. టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు..!
ఐపీఎల్(IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది.
- Thota Vamshi Kumar
- Published On : May 26, 2023 / 06:42 PM IST
Rush at Narendra Modi Stadium
IPL2023 Final Ticket: ఐపీఎల్(IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఫైనల్‌కు చేరుకోగా నేడు జరగనున్న క్వాలిఫయర్ 2 ద్వారా మరొక ఫైనలిస్ట్ ఎవరో తేలిపోనుంది. మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది. ఇదే మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి చివరి సీజన్ అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మైదానంలో ఫైనల్ మ్యాచ్ వీక్షించాలని పెద్ద సంఖ్యలో అభిమానులు కోరుకుంటున్నారు.
ఇప్పటికే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అన్ని ఆన్‌లైన్‌లో ఉంచగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్నవారు ఫిజికల్ టికెట్లను గురువారం నుంచి శనివారం వరకు స్టేడియం బాక్స్ ఆఫీస్ వద్ద క్యూ ఆర్ కోడ్‌ను చూపించి తీసుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో ఫిజికల్ టికెట్లు తీసుకునేందుకు గురువారం అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానానికి చేరుకున్నారు.
CSK vs GT IPL 2023 : దటీజ్ ధోని.. ఒక్క మ్యాచ్ తో గుజరాత్ టైటాన్స్ ఖాతాలో చెత్త రికార్డులు
టికెట్లు అందించే కౌంటర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. ఒకరినొకరు తోసుకుంటూ, కింద పడుతూ నానా తంటాలు పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ఎవ్వరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.స్టేడియం వద్ద టికెట్ల కోసం గందరగోళం నెలకొన్నట్లు వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది.
CSK: చెన్నై పవర్ అంటే ఇదీ.. 12 సార్లు ప్లే ఆఫ్స్‌కు.. అందుకేగా ధోనిని గ్రేట్ కెప్టెన్ అనేది
కాగా..నేడు(మే 26 శుక్రవారం) క్వాలిఫయర్ 2 జరగనుండడంతో ఫైనల్ మ్యాచ్ టికెట్లు పొందే అవకాశం లేదు. శనివారం తీసుకోవచ్చు. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో విజయం సాధించిన జట్టు ఆదివారం చెన్నైతో ఐపీఎల్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనుంది.
