CSK: చెన్నై ప‌వ‌ర్ అంటే ఇదీ.. 12 సార్లు ప్లే ఆఫ్స్‌కు.. అందుకేగా ధోనిని గ్రేట్ కెప్టెన్ అనేది

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను ఓడించ‌డం ద్వారా చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

CSK: చెన్నై ప‌వ‌ర్ అంటే ఇదీ.. 12 సార్లు ప్లే ఆఫ్స్‌కు.. అందుకేగా ధోనిని గ్రేట్ కెప్టెన్ అనేది

CSK entered into ipl playoffs

Chennai Super Kings: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను ఓడించ‌డం ద్వారా చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఈ టోర్నీ చ‌రిత్రలో ఇప్ప‌టికే అత్య‌ధిక సార్లు ప్లే ఆఫ్స్ కు చేరిన రికార్డును క‌లిగిన ఉన్న సీఎస్‌కే.. ఆ సంఖ్య‌ను మ‌రింత పెంచుకుంది. మొత్తంగా 16 సీజ‌న్లలో 12 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది సీఎస్‌కే. ఇందులో రెండు సీజ‌న్లు(2016,2017) బ్యాన్ కార‌ణంగా చెన్నై ఆడ‌లేద‌న్న సంగ‌తి తెలిసిందే. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రువాత ముంబై ఇండియ‌న్స్‌(ఈ సీజ‌న్‌తో కాకుండా) 9 సార్లు ప్లే ఆఫ్స్ చేరుకుంది.

ఐపీఎల్‌లో సీఎస్‌కే ప్ర‌స్థానం..

– 2008లో ఐపీఎల్ ప్రారంభ‌మైంది. మొద‌టి సీజ‌న్‌లోనే సీఎస్‌కే ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో ఓటమి పాలై ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

– 2009లో సెమీ ఫైన‌ల్‌కు చేరుకుంది. అక్క‌డ ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయింది.

– 2010లో మాత్రం అద‌ర‌గొట్టింది. మొద‌టి రెండు సీజ‌న్ల‌లో రాణించిన‌ప్ప‌టికి క‌ప్పును అందుకోలేక‌పోయిన చెన్నై ఈ సీజ‌న్‌లో మాత్రం విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్‌లో ముంబైని ఓడించింది.

– 2011లో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన సీఎస్‌కే మ‌రోసారి క‌ప్పును ముద్దాడింది. ఈ సారి ఫైన‌ల్‌లో ఆర్‌సీబీని ఓడించింది

– 2012లో హ్యాట్రిక్ ఛాంపియ‌న్‌గా నిలిచే అవ‌కాశాన్ని తృటిలో మిస్ అయ్యింది. ఫైన‌ల్‌లో కోల్‌క‌తా చేతిలో ఓడిపోయింది.

-2013లోనూ ర‌న్న‌ర‌ప్‌గానే నిలిచింది. ఫైన‌ల్‌లో ముంబై చేతిలో ఓడిపోయింది.

-2014లో ప్లే ఆఫ్స్ చేరిన సీఎస్‌కే మూడో స్థానంలో నిలిచింది. అయితే.. అదే ఏడాదిలో జ‌రిగిన ఛాంపియ‌న్స్ లీగ్ టీ20 విజేతగా నిలిచింది

-2015లో మ‌రోసారి ర‌న్న‌ర‌ప్‌గానే నిలిచింది. ఫైన‌ల్‌లో ముంబై చేతిలో ఓట‌మి పాలైంది.

-2018 రెండేళ్ల పాటు నిషేదానికి గురైన చెన్నై పున‌రాగ‌మ‌నంలో స‌త్తా చాటింది. ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌ను ఓడించి టైటిల్‌ను ముద్దాడింది.

-2019లో ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకుంది. ఫైన‌ల్‌లో ముంబై చేతిలో ఒక్క ప‌రుగు తేడాతో ఓడిపోయింది.

– 2020లో లీగ్ స్టేజ్‌కే ప‌రిమిత‌మైంది

-2021లో మ‌రోసారి టైటిల్‌ను అందుకుంది. పైన‌ల్‌లో కోల్‌క‌తాను ఓడించింది.

-2022లో లీగ్ స్టేజ్‌కే ప‌రిమిత‌మైంది.

– 2023 ప్ర‌స్తుత సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ చేరుకుంది. ధోనికి ఇదే చివ‌రి సీజ‌న్‌గా ప్ర‌చారం జ‌ర‌గుతుండ‌డంతో క‌ప్ గెల‌వాల‌ని చెన్నై అభిమానులు కోరుకుంటున్నారు.

మొత్తంగా చెన్నై నాలుగు సార్లు(2010, 2011, 2018, 2021) ఐపీఎల్ విజేత‌గా నిల‌వ‌గా, రెండు సార్లు లీగ్ స్టేజ్‌(2020, 2022)కే ప‌రిమిత‌మైంది. బ్యాన్ అయిన రెండు సీజ‌న్లు మిన‌హా మిగిలిన అన్ని సీజ‌న్ల‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.