KKR vs PBKS
IPL 2023, KKR vs PBKS: ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది
19 ఓవర్‌ను సామ్‌కరన్ వేయగా 20 పరుగులు వచ్చాయి. రస్సెల్ మూడు సిక్స్‌లు బాదాడు. 19 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 174/4. ఆండ్రీ రస్సెల్(39), రింకూ సింగ్(16) లు క్రీజులో ఉన్నారు.
18 ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేయగా 10 పరుగులు వచ్చాయి. రెండో బంతికి రస్సెల్, నాలుగో బంతికి రింకూ సింగ్‌లు ఫోర్లు కొట్టారు. 18 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 154/4. ఆండ్రీ రస్సెల్(20), రింకూ సింగ్(15) లు క్రీజులో ఉన్నారు.
17 ఓవర్‌ను నాథన్ ఎల్లిస్ వేయగా 15 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి రస్సెల్ ఫోర్ కొట్టగా మూడో బంతికి రింకూ సింగ్ సిక్స్ బాదాడు. 17 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 144/4. ఆండ్రీ రస్సెల్(15), రింకూ సింగ్(10) లు క్రీజులో ఉన్నారు.
16 ఓవర్‌ను రాహుల్ చాహర్ వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసి 37 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో నితీశ్ రాణా అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే లివింగ్‌స్టోన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 124 పరుగుల వద్ద కోల్‌కతా నాలుగో వికెట్ కోల్పోయింది.16 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 129/4. ఆండ్రీ రస్సెల్(9), రింకూ సింగ్(1) లు క్రీజులో ఉన్నారు.
15వ ఓవర్‌ను నాథన్ ఎల్లిస్ వేయగా 6 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి ఆండ్రీ రస్సెల్ ఫోర్ కొట్టాడు. 15 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 122/3. ఆండ్రీ రస్సెల్(6), నితీశ్ రాణా(49) లు క్రీజులో ఉన్నారు.
కోల్‌కతా మరో వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన వెంకటేశ్ అయ్యర్(11) లివింగ్ స్టోన్ చేతికి చిక్కాడు. దీంతో 115 పరుగుల(13.4వ ఓవర్) వద్ద కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 116/3. ఆండ్రీ రస్సెల్(1), నితీశ్ రాణా(48) లు క్రీజులో ఉన్నారు.
13వ ఓవర్‌ను సామ్ కరణ్ వేయగా 11 పరుగులు వచ్చాయి. మొదటి, ఆఖరి బంతికి రాణా ఫోర్లు కొట్టాడు. 13 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 109/2. వెంకటేశ్ అయ్యర్(10), నితీశ్ రాణా(43) లు క్రీజులో ఉన్నారు.
రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 98/2. వెంకటేశ్ అయ్యర్(9), నితీశ్ రాణా(34) లు క్రీజులో ఉన్నారు.
వరుసగా రెండు ఓవర్లలో తక్కువ పరుగులే రావడంతో నితీశ్ రాణా వేగం పెంచాడు. లివింగ్ స్టోన్ వేసిన 11 ఓవర్‌లో వరుసగా 4,4,6 బాదాడు. ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 92/2. వెంకటేశ్ అయ్యర్(7), నితీశ్ రాణా(30) లు క్రీజులో ఉన్నారు.
పదో ఓవర్‌ను రాహుల్ చాహర్ కట్టుదిట్టంగా వేయడంతో 3 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 76/2. వెంకటేశ్ అయ్యర్(6), నితీశ్ రాణా(15) లు క్రీజులో ఉన్నారు.
తొమ్మిదో ఓవర్‌ను నాథన్ ఎల్లిస్ కట్టుదిట్టంగా వేయడంతో 6 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 73/2. వెంకటేశ్ అయ్యర్(5), నితీశ్ రాణా(13) లు క్రీజులో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న జేసన్ రాయ్(38) ఔట్ అయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో షారుక్ ఖాన్ క్యాచ్ అందుకోవడంతో రాయ్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 64 పరుగుల(7.2వ ఓవర్) వద్ద కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 67/2. వెంకటేశ్ అయ్యర్(2), నితీశ్ రాణా(10) లు క్రీజులో ఉన్నారు.
ఏడో ఓవర్‌ను లివింగ్‌స్టోన్ వేయగా 11 పరుగులు వచ్చాయి. ఆఖరి రెండు బంతులకు జేసన్ రాయ్ ఫోర్లు కొట్టాడు. 7 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 63/1. జేసన్ రాయ్(38), నితీశ్ రాణా(8) లు క్రీజులో ఉన్నారు.
ఆరో ఓవర్‌ను సామ్ కరన్ వేయగా 13 పరుగులు వచ్చాయి. రెండో బంతికి నితీశ్ రాణా ఫోర్ కొట్టగా, ఆఖరి రెండు బంతులకు జేసన్ రాయ్ బౌండరీలు బాదాడు. 6 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 52/1. జేసన్ రాయ్(29), నితీశ్ రాణా(6) లు క్రీజులో ఉన్నారు.
నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్(15) ఎల్భీగా పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో కోల్‌కతా 38 పరుగుల(4.4వ ఓవర్) వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 39/1. జేసన్ రాయ్(21), నితీశ్ రాణా(1) లు క్రీజులో ఉన్నారు.
నాలుగో ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేయగా 16 పరుగులు వచ్చాయి. మొదటి రెండు బంతులను గుర్బాజ్ సిక్స్, ఫోర్‌గా మలిచాడు. ఆఖరి బంతికి రాయ్ ఫోర్ కొట్టాడు. 4 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 36/0. జేసన్ రాయ్(20), రహ్మానుల్లా గుర్బాజ్(15) లు క్రీజులో ఉన్నారు.
మూడో ఓవర్‌ను రిషి ధావన్ వేయగా 10 పరుగులు వచ్చాయి. జేసన్ రాయ్ రెండు ఫోర్లు కొట్టాడు. 3 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 20/0. జేసన్ రాయ్(16), రహ్మానుల్లా గుర్బాజ్(4) లు క్రీజులో ఉన్నారు.
రెండో ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేయగా 5 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి జేసన్ రాయ్ ఫోర్ కొట్టాడు. 2 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 10/0. జేసన్ రాయ్(7), రహ్మానుల్లా గుర్బాజ్(3) లు క్రీజులో ఉన్నారు.
లక్ష్య ఛేదనకు కోల్‌కతా దిగింది. జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి ఓవర్‌ను రిషి ధావన్ వేశాడు. 1 ఓవర్‌కు కోల్‌కతా స్కోరు 5/0. జేసన్ రాయ్(2), రహ్మానుల్లా గుర్బాజ్(3) లు క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(57; 47 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా జితేశ్ శర్మ(21; 18 బంతుల్లో 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. భానుకా రాజపక్స(0), లివింగ్ స్టోన్(15), సామ్ కరన్(4)లు విఫలం కాగా. ఆఖర్లో షారుక్ ఖాన్(21 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హర్‌ప్రీత్ బ్రార్( 17 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడడంతో పంజాబ్ మంచి స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు, హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయగా సుయాష్ శర్మ, నితీశ్ రాణా ఒక్కొ వికెట్ పడగొట్టారు.
19వ ఓవర్‌ను వైభవ్ అరోరా వేయగా 15 పరుగులు వచ్చాయి. హర్‌ప్రీత్ బ్రార్ రెండు, షారుక్ ఖాన్ ఓ ఫోర్ కొట్టాడు. 19 ఓవర్లకు పంజాబ్ స్కోరు 158/7. హర్‌ప్రీత్ బ్రార్(11), షారుక్ ఖాన్(6) లు క్రీజులో ఉన్నారు.
సుయాష్ శర్మ బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ అందుకోవడంతో సామ్‌కరన్(4) ఔట్ అయ్యాడు. దీంతో 139 పరుగుల(17.2వ ఓవర్) వద్ద పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు పంజాబ్ స్కోరు 143/7. హర్‌ప్రీత్ బ్రార్(2), షారుక్ ఖాన్(0) లు క్రీజులో ఉన్నారు.
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రిషి ధావన్(19) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ 139 పరుగుల(16.5వ ఓవర్) వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లకు పంజాబ్ స్కోరు 139/6. సామ్ కరన్(4), షారుక్ ఖాన్(0) లు క్రీజులో ఉన్నారు.
16వ ఓవర్ సునీల్ నరైన్ కట్టుదిట్టంగా వేయడంతో 7 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 131/5. సామ్ కరన్(4), రిషి ధావన్(11) లు క్రీజులో ఉన్నారు.
నితీశ్ రాణా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ధావన్(57) వైభవ్ అరోరా చేతికి చిక్కాడు. దీంతో 119 పరుగుల(14.4వ ఓవర్) వద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు పంజాబ్ స్కోరు 124/5. సామ్ కరన్(3), రిషి ధావన్(5) లు క్రీజులో ఉన్నారు.
సునీల్ నరైన్ బౌలింగ్‌లో(13.3వ ఓవర్) సిక్స్ కొట్టి 41 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో ధావన్ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 14 ఓవర్లకు పంజాబ్ స్కోరు 117/4. సామ్ కరన్(3), శిఖర్ ధావన్(55) లు క్రీజులో ఉన్నారు.
జితేశ్ శర్మ(21) ఔట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ చేతికి చిక్కాడు. దీంతో 106 పరుగుల(12.3వ ఓవర్) వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 ఓవర్లకు పంజాబ్ స్కోరు 109/4. సామ్ కరన్(2), శిఖర్ ధావన్(48) లు క్రీజులో ఉన్నారు.
12వ ఓవర్‌ను సునీల్ నరైన్ వేయగా 11 పరుగులు వచ్చాయి. శిఖర్ ధావన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 12 ఓవర్లకు పంజాబ్ స్కోరు 104/3. జితేష్ శర్మ(21), శిఖర్ ధావన్(46) లు క్రీజులో ఉన్నారు.
11వ ఓవర్‌ను సుయాష్ శర్మ వేయగా 11 పరుగులు వచ్చాయి. రెండో బంతికి జితేశ్ సిక్స్ కొట్టగా ఐదో బంతికి ధావన్ ఫోర్ బాదాడు. 11 ఓవర్లకు పంజాబ్ స్కోరు 93/3. జితేష్ శర్మ(20), శిఖర్ ధావన్(37) లు క్రీజులో ఉన్నారు.
పదో ఓవర్‌ను సునీల్ నరైన్ కట్టుదిట్టంగా వేయడంతో 3 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు పంజాబ్ స్కోరు 82/3. జితేష్ శర్మ(13), శిఖర్ ధావన్(33) లు క్రీజులో ఉన్నారు.
తొమ్మిదో ఓవర్‌ను సుయాష్ శర్మ వేయగా 9 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి జితేశ్ శర్మ సిక్స్ కొట్టాడు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోరు 79/3. జితేష్ శర్మ(11), శిఖర్ ధావన్(32) లు క్రీజులో ఉన్నారు.
ఎనిమిదో ఓవర్‌ను వరుణ్ చక్రవరి వేయగా 6 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి ధావన్ ఫోర్ కొట్టాడు. 8 ఓవర్లకు పంజాబ్ స్కోరు 70/3. జితేష్ శర్మ(3), శిఖర్ ధావన్(31) లు క్రీజులో ఉన్నారు.
ఏడో ఓవర్‌ను సుయాష్ శర్మ వేయగా 6 పరుగులు వచ్చాయి.7 ఓవర్లకు పంజాబ్ స్కోరు 64/3. జితేష్ శర్మ(2), శిఖర్ ధావన్(26) లు క్రీజులో ఉన్నారు.
పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్(15) ఎల్భీగా పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో 53 పరుగుల(5.3వ ఓవర్) వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు పంజాబ్ స్కోరు 58/3. జితేష్ శర్మ(1), శిఖర్ ధావన్(25) లు క్రీజులో ఉన్నారు.
ఐదో ఓవర్‌ను ఆండ్రీ రస్సెల్ వేయగా 19 పరుగులు వచ్చాయి. లివింగ్ స్టోన్ మూడు ఫోర్లు కొట్టగా ధావన్ ఓ బౌండరీ బాదాడు. 5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 51/2. లియామ్ లివింగ్‌స్టోన్(14), శిఖర్ ధావన్(20) లు క్రీజులో ఉన్నారు.
పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ అందుకోవడంతో భానుకా రాజపక్స(0) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 29 పరుగుల(3.4వ ఓవర్) వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లకు పంజాబ్ స్కోరు 33/2. లియామ్ లివింగ్‌స్టోన్(1), శిఖర్ ధావన్(16) లు క్రీజులో ఉన్నారు.
మూడో ఓవర్‌ను వైభవ్ అరోరా వేయగా 5 పరుగులు వచ్చాయి. మూడో బంతికి ధావన్ ఫోర్ కొట్టాడు. 3 ఓవర్లకు పంజాబ్ స్కోరు 26/1. భానుకా రాజపక్స(0), శిఖర్ ధావన్(14) లు క్రీజులో ఉన్నారు.
రెండో ఓవర్‌ను హర్షిత్ రాణా వేయగా 9 పరుగులు వచ్చాయి. మొదటి, మూడో బంతికి ధావన్ బౌండరీలు కొట్టాడు. అయితే ఆఖరి బంతికి రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ అందుకోవడంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(12) ఔట్ అయ్యాడు. దీంతో 21 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్లకు పంజాబ్ స్కోరు 21/1. భానుకా రాజపక్స(0), శిఖర్ ధావన్(9) లు క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను వైభవ్ అరోరా వేశాడు. ఈ ఓవర్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మూడు ఫోర్లు కొట్టాడు. 1 ఓవర్ కు పంజాబ్ స్కోరు 12/0.ప్రభ్‌సిమ్రాన్ సింగ్(12), శిఖర్ ధావన్(0) లు క్రీజులో ఉన్నారు.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), భానుకా రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) తలపడుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.