IPL 2023, KKR vs SRH: కోల్‌క‌తాపై స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం

ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 23 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

KKR vs SRH

IPL 2023, KKR vs SRH:ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 23 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 14 Apr 2023 11:16 PM (IST)

    గెలిచిన స‌న్‌రైజ‌ర్స్‌

    ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 23 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. 229 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్లో 7 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. కెప్టెన్ నితీశ్ రాణా( 75), రింకూ సింగ్ (58 నాటౌట్‌) లు జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల య‌త్నం చేశారు. వీరిద్ద‌రూ కాకుండా మిగిలిన వాళ్లు విఫ‌లం కావడంతో కోల్‌క‌తా ల‌క్ష్యాన్ని అందుకోలేక‌పోయింది. స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో జాన్స‌న్‌, మార్కండే చెరో రెండు వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్‌, న‌ట‌రాజ‌న్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

    అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ జ‌ట్టు హ్యారీ బ్రూక్‌(100) శ‌త‌కం బాద‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 228 ప‌రుగులు చేసింది. మార్‌క్ర‌మ్ 50, అభిషేక్ శ‌ర్మ 32 ప‌రుగుల‌తో రాణించారు. కోల్‌కతా బౌల‌ర్ల‌లో ఆండ్రూ ర‌స్సెల్ మూడు వికెట్లు తీయ‌గా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

  • 14 Apr 2023 10:59 PM (IST)

    నితీశ్ రాణా ఔట్‌

    17 ఓవ‌ర్లు : కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. న‌జ‌రాజ‌న్ బౌలింగ్‌లో ఓ సిక్స్ కొట్టిన నితీశ్ రాణా మ‌రో భారీ షాట్‌కు య‌త్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద వాషింగ్ట‌న్ సుంద‌ర్ చేతికి చిక్కాడు. దీంతో 165 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా ఆరో వికెట్ కోల్పోయింది. ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు రాగా కోల్‌క‌తా స్కోరు 171/6 కి చేరింది. శార్దూల్ ఠాకూర్ 5, రింకూ సింగ్ 33 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 10:52 PM (IST)

    17 ప‌రుగులు

    16 ఓవ‌ర్లు : మార్కో జాన్సెన్, వేసిన ఈ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ రెండు సిక్స‌ర్లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వచ్చాయి. కోల్‌క‌తా స్కోరు 159/5. రింకూ సింగ్ 32, నితీష్ రాణా 69 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 10:38 PM (IST)

    14 ప‌రుగులు

    14 ఓవ‌ర్లు : న‌ట‌రాజ‌న్ వేసిన ఈ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ ఓ సిక్స్‌, ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు వచ్చాయి. కోల్‌క‌తా స్కోరు 135/5. రింకూ సింగ్ 13, నితీష్ రాణా 67 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 10:29 PM (IST)

    నితీశ్ రాణా అర్ధ‌శ‌త‌కం

    12 ఓవ‌ర్లు : వాషింగ్ట‌న్ సుంద‌ర్ బౌలింగ్‌లో రెండు ప‌రుగులు తీసి నితీశ్ రాణా 25 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు రాగా కోల్‌క‌తా స్కోరు 111/5. రింకూ సింగ్ 4, నితీష్ రాణా 53 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 10:27 PM (IST)

    స‌గం వికెట్లు కోల్పోయిన కోల్‌క‌తా

    11 ఓవ‌ర్లు : కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. విండీస్ విధ్వంస‌క‌ర వీరుడు ఆండ్రీ ర‌స్సెల్‌ను మ‌యాంక్ మార్కండే ఔట్ చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 3 ప‌రుగులు వ‌చ్చాయి. కోల్‌క‌తా స్కోరు 99/5. రింకూ సింగ్ 2, నితీష్ రాణా 43 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 10:15 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌క‌తా

    9 ఓవ‌ర్లు : ధాటిగా ఆడే క్ర‌మంలో మ‌యాంక్ మార్కండే బౌలింగ్‌లో ఎన్‌.జ‌గ‌దీశ‌న్(36) బౌండ‌రీ లైన్ వ‌ద్ద గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. దీంతో కోల్‌క‌తా 82 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ ఓవ‌ర్‌లో రెండు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి కోల్‌క‌తా 84/4. ఆండ్రూ ర‌స్సెల్ 1, నితీష్ రాణా 35 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 10:06 PM (IST)

    దంచికొడుతున్న నితీశ్ రాణా, జ‌గ‌దీశ‌న్‌

    7 ఓవ‌ర్లు : నితీశ్ రాణా, జ‌గ‌దీశ‌న్ లు దూకుడుగా ఆడుతున్నారు. మయాంక్ మార్కండే వేసిన ఓవ‌ర్‌లో జ‌గ‌దీశ‌న్ రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు రావ‌డంతో కోల్‌క‌తా స్కోరు 74/3 కిచేరింది. ఎన్‌. జగదీసన్ 31, నితీష్ రాణా 31 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 10:02 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న నితీశ్ రాణా.. ఉమ్రాన్ ఓవ‌ర్‌లో 26 ప‌రుగులు

    6 ఓవ‌ర్లు : సునీల్ న‌రైన్ ఔట్ కావ‌డంతో క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ నితీశ్ రాణా దూకుడుగా ఆడుతున్నాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఓవ‌ర్ లో వ‌రుస‌గా 4,6, 4,4,4,4 కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 26 ప‌రుగులు రావ‌డంతో కోల్‌క‌తా స్కోరు 62/3 కి చేరింది. ఎన్‌. జగదీసన్ 20, నితీష్ రాణా 30 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 09:55 PM (IST)

    మూడు వికెట్లు కోల్పోయిన కోల్‌క‌తా

    భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన కోల్‌క‌తాకు హైద‌రాబాద్ బౌల‌ర్లు షాకిచ్చారు. మూడు వికెట్లు తీశారు. 5 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 34/3. ఎన్‌.జగదీసన్ 20, నితీష్ రాణా 2 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 09:10 PM (IST)

    శ‌త‌కంతో చెల‌రేగిన హ్యారీ బ్రూక్‌.. కోల్‌క‌తా ముందు భారీ ల‌క్ష్యం

    ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్ హైద‌రాబాద్ ఓపెన‌ర్ హ్యారీ బ్రూక్ శ‌త‌కంతో చెల‌రేగిపోయాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో ఐపీఎల్‌లో తొలి శ‌త‌కాన్ని సాధించాడు. దీంతో హైద‌రాబాద్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 228 ప‌రుగులు చేసింది. హైద‌రాబాద్ బ్యాట‌ర్లో మార్‌క్ర‌మ్ 50, అభిషేక్ శ‌ర్మ 32, క్లాస‌న్ 16 నాటౌట్ రాణించారు.

  • 14 Apr 2023 08:59 PM (IST)

    దంచికొడుతున్న బ్రూక్‌, అభిషేక్‌

    18 ఓవ‌ర్లు : కోల్‌క‌తా బౌల‌ర్ల‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుప‌డుతున్నాడు హ్యారీ బ్యూక్‌, అభిషేక్ శ‌ర్మ‌. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేసిన ఓవ‌ర్‌లో అభిషేక్ శ‌ర్మ సిక్స్ కొట్ట‌గా బ్రూక్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు రావ‌డంతో హైద‌రాబాద్ స్కోరు 200/3 కి చేరింది. అభిషేక్ శర్మ 32, హ్యారీ బ్రూక్ 90 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 08:50 PM (IST)

    15 ప‌రుగులు

    16 ఓవ‌ర్లు : సుయాష్ శర్మ వేసిన ఓవ‌ర్‌లో హ్యారీ బ్రూక్ ఓ ఫోర్ కొట్ట‌గా అభిషేక్ శ‌ర్మ రెండు ఫోర్లు బాదాడు. ఈ ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు రావ‌డంతో హైద‌రాబాద్ స్కోరు 172/3 కి చేరింది. అభిషేక్ శర్మ 13, హ్యారీ బ్రూక్ 82 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 08:47 PM (IST)

    దంచికొడుతున్న హ్యారీ బ్రూక్‌

    15 ఓవ‌ర్లు : లాకీ ఫెర్గూసన్ వేసిన ఓవ‌ర్‌లో హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 23 ప‌రుగులు రావ‌డంతో హైద‌రాబాద్ స్కోరు 157/3. అభిషేక్ శర్మ 3, హ్యారీ బ్రూక్ 77 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 08:33 PM (IST)

    మార్‌క్ర‌మ్ హాఫ్ సెంచ‌రీ.. ఆ వెంట‌నే ఔట్‌

    13 ఓవ‌ర్లు : కెప్టెన్ మార్‌క్ర‌మ్ దూకుడు పెంచాడు. వ‌రుణ్‌చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో వ‌రుస‌గా రెండు, మూడు బంతుల‌ను ఫోర్‌, సిక్స్‌లుగా మ‌లిచి ఐపీఎల్‌లో మ‌రో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఆ మ‌రుస‌టి బంతికే ర‌స్సెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు రావ‌డంతో హైద‌రాబాద్ స్కోరు 130/3. అభిషేక్ శర్మ 1, హ్యారీ బ్రూక్ 53 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 08:28 PM (IST)

    మార్‌క్ర‌మ్ దూకుడు

    12 ఓవ‌ర్లు : కెప్టెన్ మార్‌క్ర‌మ్ దూకుడు పెంచాడు. సుయాష్ శర్మ వేసిన ఈ ఓవ‌ర్లో రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు రావ‌డంతో హైద‌రాబాద్ స్కోరు 116/2. ఐదెన్ మార్‌క్ర‌మ్ 40, హ్యారీ బ్రూక్ 50 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 08:24 PM (IST)

    హ్యారీ బ్రూక్ అర్ధ‌శ‌త‌కం

    సునీల్ న‌రైన్ వేసిన 11 ఓవ‌ర్‌లోని మూడో బంతికి సింగిల్ తీసిన హ్యారీ బ్రూక్ ఐపీఎల్ లో త‌న తొలి అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్లకు హైద‌రాబాద్ స్కోరు 100/2. ఐదెన్ మార్‌క్ర‌మ్ 24, హ్యారీ బ్రూక్ 50 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 08:14 PM (IST)

    5 ప‌రుగులు

    సునీల్ నరైన్ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 9 ఓవ‌ర్లకు హైద‌రాబాద్ స్కోరు 85/2. ఐదెన్ మార్‌క్ర‌మ్ 14, హ్యారీ బ్రూక్ 45 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 08:04 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేసిన ఆరో ఓవ‌ర్‌లో బ్రూక్ ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తం ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్లకు హైద‌రాబాద్ స్కోరు 65/2. ఐదెన్ మార్‌క్ర‌మ్ 1, హ్యారీ బ్రూక్ 39 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 07:58 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన హైద‌రాబాద్

    స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆండ్రీ ర‌స్సెల్ బౌలింగ్‌లో తొలి బంతికి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి క్యాచ్ ఇచ్చి మ‌యాంక్ అగ‌ర్వాల్(9) ఔట్ అయ్యాడు. వ‌న్‌డౌన్ లో వ‌చ్చిన రాహుల్ త్రిపాఠి మొద‌టి బంతికి బౌండ‌రీ కొట్టి ప‌రుగుల ఖాతాను ఓపెన్ చేశాడు. అయితే.. ఆఖ‌రి బంతికి ఔట్ అయ్యాడు. దీంతో హైద‌రాబాద్ రెండు వికెట్లు కోల్పోయింది. 5 ఓవ‌ర్లకు హైద‌రాబాద్ స్కోరు 57/2. హ్యారీ బ్రూక్ 33 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 07:49 PM (IST)

    వ‌రుస‌గా రెండు సిక్స్‌లు

    హ్యారీ బ్రూక్ దూకుడు కొన‌సాగిస్తున్నాడు. ఉమేశ్ యాద‌వ్ వేసిన మూడో ఓవ‌ర్‌లో వ‌రుస‌గా రెండు సిక్స్‌లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్లకు హైద‌రాబాద్ స్కోరు 43/0 మయాంక్ అగర్వాల్ 7, హ్యారీ బ్రూక్ 31 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 07:42 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న హ్యారీ బ్రూక్

    ఇంగ్లాండ్ ఆట‌గాడు హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడుతున్నాడు. తొలి ఓవ‌ర్‌లో మూడు ఫోర్లు కొట్టిన బ్రూక్ లాకీ ఫెర్గూసన్ వేసిన రెండో ఓవ‌ర్‌లో ఓ ఫోర్ బాదాడు. 2 ఓవ‌ర్లకు హైద‌రాబాద్ స్కోరు 28/0 మయాంక్ అగర్వాల్ 5, హ్యారీ బ్రూక్ 18 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 07:36 PM (IST)

    మొద‌టి ఓవ‌ర్‌లో మూడు ఫోర్లు కొట్టిన బ్రూక్‌

    టాస్ ఓడిపోవ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు బ్యాట‌ర్లు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. ఓపెన‌ర్లుగా హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ బ‌రిలోకి దిగారు. ఉమేష్ యాదవ్ తొలి ఓవ‌ర్‌ను వేశాడు. తొలి బంతినే హ్యారీ బ్రూక్ ఫోర్‌గా మ‌లిచాడు. త‌రువాత రెండు సింగిల్స్ రాగా.. నాలుగు, ఐదు బంతుల‌కు బ్రూక్ ఫోర్లు కొట్టాడు. 1 ఓవ‌ర్‌కు హైద‌రాబాద్ స్కోరు 14/0 మయాంక్ అగర్వాల్ 1, హ్యారీ బ్రూక్ 13 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 14 Apr 2023 07:06 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజ‌ట్టు

    హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్‌), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

  • 14 Apr 2023 07:06 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు

    రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్), ఎన్‌. జగదీసన్, నితీష్ రాణా(కెప్టెన్‌), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

  • 14 Apr 2023 07:05 PM (IST)

    టాస్ గెలిచిన కోల్‌క‌తా

    టాస్ గెలిచిన కోల్‌క‌తా బౌలింగ్ ఎంచుకుంది. ఈ గ్రౌండ్‌లో చాలా సాధ‌న చేశాము. ఇక్క‌డ మంచు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ల‌క్ష్యాన్ని చేధించాల‌ని బావిస్తున్నాము అని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ నితీశ్ రాణా అన్నాడు.