RR vs PBKS
IPL 2023: RR vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో నేడు ఎనిమిదో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ (RR vs PBKS) మధ్య అసోంలోని గువాహటి, బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 5 పరుగుల తేడాతో రాజస్తాన్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR) బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 197 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ పోరాడి ఓడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.
186 పరుగుల వద్ద రాజస్తాన్ జట్టు 7వ వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న హెట్ మైర్(18 బంతుల్లో 36 రన్స్) ఔటయ్యాడు.
రాజస్తాన్ జట్టు 19 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజులో హెట్ మైర్, ధృవ్ జురెల్ ఉన్నారు.
రాజస్తాన్ జట్టు 18 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో హెట్ మైర్, ధృవ్ జురెల్ ఉన్నారు.
రాజస్తాన్ జట్టు 15 ఓవర్లు ముగిసే సమయానికి 124 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్ ఎల్లిస్ 4 వికెట్లు తీశాడు.
రాజస్తాన్ జట్టు 121 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు.
రాజస్తాన్ జట్టు 91 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ సంజూ శాంసన్ ఔటయ్యాడు. సంజూ 25 బంతుల్లో 42 రన్స్ చేశాడు.
రాజస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(11), అశ్విన్(0), జోస్ బట్లర్(19) ఔటయ్యారు.
9 ఓవర్లలో రాజస్తాన్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.
57 పరుగుల వద్ద రాజస్తాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు.
198 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్.. 26 పరుగులకే రెండు వికెట్లో కోల్పోయింది. ఓపెనర్ అశ్విన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. జైస్వాల్ (7), రవిచంద్రన్ అశ్విన్ (0) క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లో 7 పరుగులు చేశారు.
రాజస్థాన్ రాయల్స్ ముందు పంజాబ్ కింగ్స్ జట్టు 198 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ చెలరేగి ఆడాడు. 56 బంతుల్లో 3 సిక్సులు 9 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా 60 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో హోల్డర్ 2, రవిచంద్రన్ అశ్విన్, చాహల్ చెరో వికెట్ తీశారు.
పంజాబ్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయింది. సికందర్ రజా 1 పరుగుకే ఔటయ్యాడు. ఆ జట్టు స్కోరు 165/3 (17 ఓవర్లకు)గా ఉంది.
శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ బాదాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ 63 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జితేశ్ శర్మ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ జట్టు స్కోరు 16 ఓవర్లకు 159/2గా ఉంది.
పంజాబ్ కింగ్స్ జట్టు స్కోరు 113/1 (12 ఓవర్లకు)గా ఉంది. శిఖర్ ధావన్ (36), జితేశ్ శర్మ (12) క్రీజులో ఉన్నారు.
రాజపక్సే 1 పరుగు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. క్రీజులోకి రితేశ్ శర్మ వచ్చాడు.
పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 60 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (27), రాజపక్సే (1) ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హాఫ్ సెంచరీ బాదాడు. 28 బంతుల్లో 2 సిక్సులు, 7 ఫోర్ల సాయంతో .. పరుగులు చేశాడు. క్రీజులో అతడితో పాటు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (16) ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ జట్టు స్కోరు 5 ఓవర్లకి 56గా ఉంది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 13, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 39 క్రీజులో ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 100 సార్లు టాస్ గెలిచింది.
పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వచ్చారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కాల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆసిఫ్, చాహల్
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.