IPL2023 RCB Vs LSG : లక్నోపై ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు

IPL 2023: 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరికి 19.5ఓవర్లలో 108 పరుగులకు లక్నో ఆలౌట్ అయ్యింది.

IPL2023 RCB Vs LSG

IPL2023 RCB Vs LSG : లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రివెంజ్ తీర్చుకుంది. గత మ్యాచ్ లో తనను ఓడించిన లక్నోని.. ఈ మ్యాచ్ లో ఓడించి లెక్క సరి చేసింది. లక్నో పై 18 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆర్సీబీ. లక్ష్యం పెద్దదేమీ కాదు. కేవలం 127 పరుగులే. కానీ, బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. లక్నో బ్యాటర్లను బెంబేలెత్తించారు. వరుసగా వికెట్లు తీసి లక్నో పతనాన్ని శాసించారు.

Also Read..Rohit Sharma: రోహిత్ రెస్ట్ తీసుకో అన్న గ‌వాస్క‌ర్.. అన్ని మ్యాచ్‌లు ఆడ‌తాడ‌న్న ముంబై కోచ్ బౌచ‌ర్‌..!

127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరికి 19.5ఓవర్లలో 108 పరుగులకు లక్నో ఆలౌట్ అయ్యింది. కృణాల్ పాండ్యా(14), స్టోయినిస్(13), గౌతమ్ (23), మిశ్రా (19), నవీన్ ఉల్ హక్(13) మినహా మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో కరణ్ శర్మ, హేజిల్ వుడ్ తలో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, మ్యాక్స్ వెల్, హర్షల్, హసరంగా చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

స్కోర్లు..
బెంగళూరు-20ఓవర్లలో 126/9
లక్నో-19.5ఓవర్లలో 108 ఆలౌట్