IPL 2023, RR vs DC
IPL 2023, RR vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో మ్యాచ్ లోనూఓడిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL-2023)లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)- ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య అసోంలోని గువాహటి బర్సపరా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్ స్కోరు 20 ఓవర్లలో 199/4గా నమోదైంది. 200 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి నుంచీ తడబడింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 64, లలిత్ యాదవ్ 38, రిలీ రసౌ 14 పరుగులు మినహా మిగతా ఏ బ్యాట్స్ మెన్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసింది. 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.
కాగా, నేటి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్లోనే 5 ఫోర్లు కొట్టి ప్రేక్షకులతో విజిల్స్ వేయించాడు. తొలి మూడు బంతులను హ్యాట్రిక్ ఫోర్లుగా మలిచాడు. నాలుగో బంతి డాట్ గా నమోదైంది. 5, 6వ బంతుల్లో మళ్లీ ఫోర్లు బాదాడు. దీంతో తొలి ఓవర్లో అతడు ఒక్కడే 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో యశస్వి 30 బంతుల్లో ఒక సిక్సు, 11 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి ముకేశ్ కుమార్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ఇక మరో ఓపెనర్ బట్లర్ 51 బంతుల్లో ఒక సిక్సు, 11 ఫోర్ల సాయంతో 79 పరుగులు చేసి ముకేశ్ కుమార్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. సంజూ శాంసన్ డకౌట్ కాగా, రియాన్ పరాగ్ 7, షిమ్రాన్ 39 (నాటౌట్), ధ్రువ్ జురెల్ 8 (నాటౌట్) పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ స్కోరు 20 ఓవర్లలో 199/4గా నమోదైంది. మరోవైపు, ప్రస్తుత సీజన్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచులు ఆడి రెండింట్లో గెలిచింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహెల్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీశ్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ , అన్రిచ్ నార్ట్ జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్