RR vs LSG
IPL 2023, RR vs LSG: ఐపీఎల్ 2023 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా మూడు మ్యాచుల్లో గెలుపొందిన రాహుల్ నేతృత్వంలోని లక్నో రెండో స్థానంలో ఉంది. టాప్ -2 జట్లు పోటీపడుతుండడంతో మ్యాచ్ హోరీ హోరీగా సాగే అవకాశం ఉంది
రాజస్థాన్ రాయల్స్ జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. అందివచ్చిన అవకాశాలను ఆ జట్టు ఆటగాళ్లు చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ , హిట్‌మయర్ లు పుల్ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. వీరితో పాటు యువ ఆటగాళ్లు పడిక్కల్, రియాన్ పరాగ్‌లు సైతం బ్యాట్ ఝుళిపిస్తే బ్యాటింగ్‌లో రాజస్థాన్‌కు తిరుగులేదు. బౌలింగ్‌లో సందీప్ శర్మ, బౌల్ట్, అశ్విన్, చాహల్‌లు ప్రత్యర్థి పని పడుతున్నారు. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండడం రాజస్థాన్‌కు కాస్త కలిసి వచ్చే అంశం. ఒకవేళ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ భావిస్తే జంపా స్థానంలో హోల్డర్‌ను తీసుకోవచ్చు.
IPL 2023: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం.. మహ్మద్ సిరాజ్ బీసీసీఐకు తెలియజేయడంతో వెలుగులోకి వ్యవహారం ..
అటు లక్నో జట్టు కూడా బలంగానే కనిస్తోంది. అయితే.. ఎవరో ఒకరు ఇద్దరు రాణించడంతో మూడు మ్యాచుల్లో గెలిచింది గానీ సమిష్టిగా ఆడడంలో మాత్రం విఫలం అవుతున్నారు. కైల్ మేయర్స్ స్థానంలో క్వింటన్ డికాక్‌ను లక్నో తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినస్, కేఎల్ రాహుల్ లు రాజస్థాన్ బౌలింగ్ దాడిని తట్టుకుని ఎంతమేరకు నిలబడతారో చూడాలి. ముఖ్యంగా లక్నో జట్టును ఆల్‌రౌండర్ దీపక్ హుడా ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు దారుణంగా విఫలం అవుతుండడం లక్నో విజయావకాశాలను దెబ్బతీస్తోంది. మార్క్‌వుడ్, ఆవేశ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, బిష్ణోయ్ లతో కూడిన బౌలింగ్ లైనప్ భీకర ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ బ్యాటర్లను ఎంతమేరకు అడ్డుకుంటుందన్న దానిపైనే లక్నో విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
హెడ్ టూ హెడ్ రికార్డు..
ఇరు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్‌లో కేవలం రెండు సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. ఐపీఎల్ 2022 సీజన్‌లోనే లక్నో జట్టు అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే.
IPL 2023, RR vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ ఓటమి.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయం
తుది జట్ల (అంచనా)
రాజస్థాన్ రాయల్స్ :
తొలుత బ్యాటింగ్ అయితే.. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ.
మొదట బౌలింగ్ అయితే : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, మురుగన్ అశ్విన్.
ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపికలు : దేవదత్ పడిక్కల్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, రియాన్ పరాగ్, కేఎమ్ ఆసిఫ్.
లక్నో సూపర్ జెయింట్స్:
తొలుత బ్యాటింగ్ అయితే.. క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, జయదేవ్ ఉనాద్కత్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
మొదట బౌలింగ్ అయితే.. క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), అమిత్ మిశ్రా/కృష్ణప్ప గౌతమ్, జయదేవ్ ఉనద్కత్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపికలు: కృష్ణప్ప గౌతమ్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, కైల్ మేయర్స్, ఆయుష్ బదోని