Rohit Sharma : సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా
హైదరాబాద్ లోని క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఇష్టపడే క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరు. దీనికి కారణం లేకపోలేదు. రోహిత్ తల్లి వైజాగ్ కు చెందిన వారు. అతనికి తెలుగు రాష్ట్రాలతో కనెక్ట్ ఉంది.
- Harish Thanniru
- Updated on- December 16, 2023 / 12:40 PM IST
Rohit Sharma
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ప్రాంఛైజీల్లో ముంబై ఇండియన్స్ ఒకటి. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అయితే.. తాజాగా ముంబై జట్టు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు షాకిచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది. టోర్నీలోకి అడుగుపెట్టిన మొదటి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌కు కప్పును అందించిన హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లుగా తెలియజేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయం పట్ల రోహిత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ మాత్రం కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. రోహిత్ ను సన్ రైజర్స్ జట్టులోకి తీసుకొని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించడం పట్ల ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ అభిమానులతో పాటు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు అభిమానులుసైతం రోహిత్ శర్మను సన్ రైజర్స్ జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభంలో హైదరాబాద్ కు డెక్కన్ ఛార్జర్స్ ప్రాతినిధ్యం వహించిన జట్టుగా ఉంది. రోహిత్ శర్మ ఐపీఎల్ లోకి డెక్కన్ ఛార్జర్స్ నుండి అరంగేట్రం చేశాడు. ఆ తరువాత డెక్కన్ ఛార్జర్స్ ప్రాంచైజీ రద్దు కావడం.. సన్ రైజర్స్ హైదరాబాద్ మారిపోవడం జరిగిపోయింది. ఈ పరిణామాలతో ఐపీఎల్ 2013 సీజన్ లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : MS Dhoni Jersey : సచిన్ తరువాత ధోనీకి అరుదైన గౌరవం.. నంబర్ 7 జెర్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం
హైదరాబాద్ లోని క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఇష్టపడే క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరు. దీనికి కారణం లేకపోలేదు. రోహిత్ తల్లి వైజాగ్ కు చెందిన వారు. అతనికి తెలుగు రాష్ట్రాలతో కనెక్ట్ ఉంది. దీంతో రోహిత్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తీసుకోవాలని, కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఇది చాలా విచిత్రమైన చర్య కావచ్చు.. కానీ, రోహిత్ శర్మ అభిమానులతో పాటు, సన్ రైజర్స్ జట్టు అభిమానులు సైతం ఈ వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు సన్ రైజర్స్ యాజమాన్యం ఆ మేరకు ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? అందుకు వారి వద్ద వెసులుబాటు ఉందా అనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.
