MS Dhoni Jersey : సచిన్ తరువాత ధోనీకి అరుదైన గౌరవం.. నంబర్ 7 జెర్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం

సచిన్ జెర్సీ నెం.7కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నెం.7కు రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు గతంలో బీసీసీఐకి సూచించారు. ధోనీ అభిమానుల నుంచికూడా తరచూ ఇలాంటి డిమాండ్ వినిపిస్తోంది.

MS Dhoni Jersey : సచిన్ తరువాత ధోనీకి అరుదైన గౌరవం.. నంబర్ 7 జెర్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం

MS Dhoni

Updated On : December 16, 2023 / 7:39 AM IST

MS Dhoni BCCI : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇప్పటికీ క్రికెట్ అభిమానుల్లో యమక్రేజ్ ఉంటుంది. భారత్ జట్టు మైదానంలో క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు క్రికెట్ వీక్షించేవారికి ఎంఎస్ ధోనీ గుర్తుకొస్తాడనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ధోనీ ఉంటేనా.. అతని కెప్టెన్సీ మాయాజాలంతో మ్యాచ్ భారత్ వైపుకు తిప్పేవాడు అంటూ మ్యాచ్ వీక్షించే వారు ఇప్పటికీ చర్చించుకోవటం మనం చూస్తూనే ఉంటాం. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ ఐపీఎల్ లో తన కెప్టెన్సీ, బ్యాట్ తో క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నాడు. తాజాగా బీసీసీఐ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : Suryakumar Yadav : గాయంతో మైదానాన్ని వీడిన సూర్య.. మ్యాచ్ తరువాత అసలు విషయం చెప్పేశాడు..

భారత్ క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్  నంబర్ 10 జెర్సీకి చాలా ప్రాముఖ్యత ఉంది. జెర్సీ నంబర్ 10 అంటే సచిన్ గుర్తుకొస్తారు. జెర్సీ నెం. 7 అంటే మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకొస్తారు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తరువాత అతని జెర్సీ నంబర్ 10కి బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ పై ఉన్న గౌరవంతో భవిష్యత్ లో ఏ భారత క్రికెటర్ కు ఆ జెర్సీ నెంబర్ ను కేటాయించబోమని బీసీసీఐ అప్పట్లో చెప్పుకొచ్చింది. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో నివేదిక ప్రకారం.. మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అదే గౌరవం ఇచ్చింది. యువ ఆటగాళ్లు, ప్రస్తుతం భారత జట్టు ఆటగాళ్లు ధోనీ నంబర్ 7 జెర్సీని ఎంచుకోవద్దని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో నవంబర్ 7 జెర్సీని కొత్త ఆటగాళ్లు పొందలేరు.

Also Read : Suryakumar Yadav : చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ద‌క్షిణాఫ్రికా పై విధ్వంస‌క‌ర సెంచ‌రీ

సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు గతంలో బీసీసీఐకి సూచించారు. ధోనీ అభిమానుల నుంచికూడా తరచూ ఇలాంటి డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా బీసీసీఐ ధోనీకి అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత్ క్రికెట్ కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా ధోనీకి ఈ అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఇకమీదట భారత్ జట్టులోకి వచ్చే కొత్త కుర్రాళ్లెవరూ నంబర్ 7, నంబర్ 10 జెర్సీలను ఎంపిక చేసుకొనే అవకాశం ఉండదు.