Suryakumar Yadav : చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. దక్షిణాఫ్రికా పై విధ్వంసకర సెంచరీ
టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.

Suryakumar Yadav creates history with most t20 centuries
టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాది సెంచరీని పూర్తి చేశాడు. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా.. కెప్టెన్‌గా తొలి సెంచరీ కావడం విశేషం.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..
సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 57 ఇన్నింగ్స్‌ల్లో – 4 సెంచరీలు
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 92 ఇన్నింగ్స్‌ల్లో – 4 సెంచరీలు
రోహిత్ శర్మ (భారత్) – 140 ఇన్నింగ్స్‌ల్లో – 4 సెంచరీలు
IND vs SA : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..!
Most T20i centuries:
Suryakumar Yadav – 4* (57 innings).
Glenn Maxwell – 4 (92 innings).
Rohit Sharma – 4 (140 innings).– Sky, Big Show and the Hitman ruling…!!! ? pic.twitter.com/HGLRFjuiBR
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2023
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (100; 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ చేయగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (60; 41బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం బాదాడు.దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, విలియమ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. షంసీ, బర్గర్ చెరో వికెట్ పడగొట్టారు.
Cameron Green : చిన్నప్పటి నుంచి కిడ్నీ సమస్య..12 ఏళ్లకు మించి బతకనని..