Suryakumar Yadav creates history with most t20 centuries
టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాది సెంచరీని పూర్తి చేశాడు. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా.. కెప్టెన్‌గా తొలి సెంచరీ కావడం విశేషం.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..
సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 57 ఇన్నింగ్స్‌ల్లో – 4 సెంచరీలు
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 92 ఇన్నింగ్స్‌ల్లో – 4 సెంచరీలు
రోహిత్ శర్మ (భారత్) – 140 ఇన్నింగ్స్‌ల్లో – 4 సెంచరీలు
IND vs SA : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..!
Most T20i centuries:
Suryakumar Yadav – 4* (57 innings).
Glenn Maxwell – 4 (92 innings).
Rohit Sharma – 4 (140 innings).– Sky, Big Show and the Hitman ruling…!!! ? pic.twitter.com/HGLRFjuiBR
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2023
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (100; 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ చేయగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (60; 41బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం బాదాడు.దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, విలియమ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. షంసీ, బర్గర్ చెరో వికెట్ పడగొట్టారు.
Cameron Green : చిన్నప్పటి నుంచి కిడ్నీ సమస్య..12 ఏళ్లకు మించి బతకనని..