Suryakumar Yadav : గాయంతో మైదానాన్ని వీడిన సూర్య.. మ్యాచ్ తరువాత అసలు విషయం చెప్పేశాడు..

టీమిండియా ఫీల్డింగ్ సమయంలో మూడో ఓవర్లో సూర్య గాయంతో మైదానాన్ని వీడాడు. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్లో సఫారీ బ్యాటర్ రీజా హెండ్రిక్స్ కొట్టి షాట్ ను ఆపి బంతిని విసిరే సమయంలో అతను బ్యాలెన్స్ కోల్పోయాడు.

Suryakumar Yadav : గాయంతో మైదానాన్ని వీడిన సూర్య.. మ్యాచ్ తరువాత అసలు విషయం చెప్పేశాడు..

Suryakumar injury

Updated On : December 15, 2023 / 8:48 AM IST

India vs South Africa 3rd T20 Match: సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి దక్షిణాఫ్రికాను చిత్తు చేశారు. తద్వారా టీ20 సిరీస్ ను సమం చేశారు. గురువారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి సఫారీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. అయితే.. భారత్ ఫీల్డింగ్ సమయంలో గాయం కారణంగా సూర్య మైదానాన్ని వీడాడు.

Also Read : Suryakumar Yadav : చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ద‌క్షిణాఫ్రికా పై విధ్వంస‌క‌ర సెంచ‌రీ

టీమిండియా ఫీల్డింగ్ సమయంలో మూడో ఓవర్లో సూర్య గాయంతో మైదానాన్ని వీడాడు. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్లో సఫారీ బ్యాటర్ రీజా హెండ్రిక్స్ కొట్టి షాట్ ను ఆపి బంతిని విసిరే సమయంలో అతను బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో సూర్యకు చీలమండకు గాయమైంది. మైదానం నుంచి స్వతహాగా బయటకు వెళ్లే పరిస్థితిలేక పోవటంతో సహాయకులు సూర్యను ఎత్తుకొని మైదానం బయటకు తీసుకె్లారు. ఆ తరువాత మ్యాచ్ పూర్తయ్యే వరకు మైదానంలోకి అడుగు పెట్టలేదు. అయితే, సూర్యకు తీవ్రగాయమైనట్లు అభిమానులు ఆందోళన చెందారు. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ గాయం తీవ్రతపై వివరాలు వెల్లడించారు.

Also Read : IND-W vs ENG-W Test : మహిళల టెస్టు క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌.. 88 ఏళ్ల‌లో ఇదే తొలిసారి..

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. నేను బాగున్నాను.. నేను నడవ గలుగుతున్నానని చెప్పాడు. నాకు అయిన గాయం తీవ్రమైనది కాదు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ మ్యాచ్ లో వంద స్కోర్ చేయడంపై ప్రశ్నించగా.. వంద స్కోర్ చేయడం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మేము అనుకున్నట్లుగానే ఎలాంటి ఆందోళన లేకుండా బ్యాటింగ్ చేశాం. జట్టులోని మిగిలిన ప్లేయర్స్ అద్భుత ప్రతిభ కనబర్చారు. కుల్దీప్ బౌలింగ్ బాగాచేశాడు. అతను ఎప్పుడూ సంతోషంగా లేడు.. ఎప్పుడూ వికెట్ల ఆకలితో ఉంటాడు. ఇది అతని పుట్టినరోజున ఒక మంచి స్వీయ బహుమతి అని సూర్యా అన్నారు.