IND-W vs ENG-W Test : మహిళల టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. 88 ఏళ్లలో ఇదే తొలిసారి..
IND-W vs ENG-W : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భారత మహిళలు అదరగొట్టారు. మొదటి రోజు ఆటలో 400 లకు పైగా పరుగులు సాధించారు.

India Women score 410 in one day against England in test match
IND-W vs ENG-W : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భారత మహిళలు అదరగొట్టారు. మొదటి రోజు ఆటలో 400 లకు పైగా పరుగులు సాధించారు. నలుగురు బ్యాటర్లు అర్ధశతకాలు బాదారు. మొత్తంగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది. దీప్తి శర్మ (60), పూజా వస్త్రాకర్ (4) క్రీజులో ఉన్నారు.
మహిళల టెస్టు క్రికెట్‌లో గత 88 ఏళ్లలో మొదటి రోజే నాలుగు వందలకు పైగా పరుగులు చేసిన మొదటి జట్టుగా భారత్ రికార్డులకు ఎక్కింది. మొత్తంగా అయితే.. ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. గతంలో 1935లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 431 పరుగులు చేసింది.
నలుగురు హాఫ్ సెంచరీలు..
ముంబై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో గురువారం ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచులో టీమ్ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా స్మృతి మంధాన (17), షఫాలీ వర్మ(19)లు వచ్చారు. ఉన్నంత సేపు మంధాన దూకుడుగా ఆడగా షపాలీ మాత్రం క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించింది. వీరిద్దరిని స్వల్ప వ్యవధిలో ఇంగ్లాండ్ బౌలర్లు పెవిలియన్‌కు చేర్చారు. దీంతో భారత్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
Usman Khawaja : వివాదం తరువాత.. బూట్లు లేకుండానే ఖవాజా ఇంటర్వ్యూ.. పిక్ వైరల్
??????!
Delightful day for #TeamIndia as the batters help reach 410/7 ?@Deepti_Sharma06 remains unbeaten on 60* ?
Follow the match ▶️ https://t.co/UB89NFaqaJ#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/O3vpqJ7stA
— BCCI Women (@BCCIWomen) December 14, 2023
ఈ దశలో అరంగ్రేట బ్యాటర్ శుభా సతీష్ (69; 76 బంతుల్లో 13 ఫోర్లు) దూకుడుగా ఆడింది. 49 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మహిళల టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన అర్ధశతకం బాదిన మూడో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కింది. జెమీమా రోడిగ్స్ (68; 99 బంతుల్లలో 11 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించింది. హాఫ్ సెంచరీ తరువాత మరింత దూకుడుగా ఆడేందుకు యత్నించి పెవిలియన్‌కు చేరుకుంది. ఆ కాసేపటికే జెమీమా కూడా ఔటైంది. అప్పటికి భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు
కెప్టెన్ రనౌట్..
Cameron Green : చిన్నప్పటి నుంచి కిడ్నీ సమస్య..12 ఏళ్లకు మించి బతకనని..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (49; 81 బంతుల్లో 6 ఫోర్లు), యస్తికా భాటియా (66; 88 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్) తీసుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్ కు 116 పరుగులు జోడించారు. ఓ అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించిన హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో రనౌట్ అయింది. దీప్తి శర్మ అర్ధశతకంతో రాణించడంతో భారత్ మొదటి రోజే నాలుగు వందల పరుగులను దాటింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీసింది. కేట్ క్రాస్, ఛార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.