Usman Khawaja : వివాదం త‌రువాత‌.. బూట్లు లేకుండానే ఖ‌వాజా ఇంట‌ర్వ్యూ.. పిక్ వైర‌ల్‌

Usman Khawaja Interview : స్వేచ్ఛ మానవ హక్కు.. అందరి జీవితాలు సమానమే అనే సందేశాన్ని రాసి ఉన్న బూట్ల‌తో ప్రాక్టీస్ సెష‌న్‌లో పాలొన్నాడు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ఉస్మాన్ ఖవాజా

Usman Khawaja : వివాదం త‌రువాత‌.. బూట్లు లేకుండానే ఖ‌వాజా ఇంట‌ర్వ్యూ.. పిక్ వైర‌ల్‌

Usman Khawaja Barefoot Interview After His Pro Palestine Shoes Controversy

స్వేచ్ఛ మానవ హక్కు.. అందరి జీవితాలు సమానమే అనే సందేశాన్ని రాసి ఉన్న బూట్ల‌తో ప్రాక్టీస్ సెష‌న్‌లో పాలొన్నాడు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ఉస్మాన్ ఖవాజా. దీనిపై పెద్ద వివాద‌మే చెల‌రేగ‌డంతో గురువారం పాకిస్తాన్ జ‌రిగిన మొద‌ట టెస్టు మ్యాచులో వేరే బూట్ల‌తో బ‌రిలోకి దిగాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ చెప్పిన‌ట్లుగా ఖ‌వాజా స‌మ‌స్య‌ను పెద్ద‌ది చేయ‌కూడ‌ని భావించాడు. అందుక‌నే వేరే బూట్ల‌తో బ‌రిలోకి దిగిన‌ట్లుగా తెలుస్తోంది.

అయితే.. మొద‌టి రోజు ఆట ప్రారంభం కావ‌డానికి ముందు 7 క్రికెట్ అత‌డిని ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్వ్యూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఖ‌వాజా ఎటువంటి చెప్పులు లేకుండానే ఇందులో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఖవాజా తాను ఐసీసీ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు. అదే స‌మ‌యంలో త‌న స్వ‌రాన్ని పెంచిన కార‌ణానికి సైతం అండ‌గా నిలుస్తాన‌న్నాడు.

‘నేను పెద్ద వాడిని. నేను చేయాల‌నుకున్న‌ది చేయొచ్చు. అప్పుడు ఐసీసీ నాకు జ‌రిమానాలు విధిస్తూ ఉంటుంది. ఏదో ఒక స‌మ‌యంలో ఇది ఆట‌కు దూరం చేస్తుంది.’అని ఖ‌వాజా అన్నాడు. స్లోగన్‌లు రాసి ఉన్న షూలను ధరించకూడదన్న ఐసీసీ నిర్ణయాన్ని సవాలు చేస్తానని పేర్కొన్నాడు. గతంలో అనేక ఉదంతాలు జరిగాయని.. అయితే పాలకమండలి దాని గురించి ఏమీ చేయలేదని పేర్కొంటూ ఆయన ఈ చర్యను ‘అన్యాయం’ అని పిలిచారు.

Cameron Green : చిన్న‌ప్ప‌టి నుంచి కిడ్నీ స‌మ‌స్య‌..12 ఏళ్ల‌కు మించి బ‌త‌క‌నని..

వివాదం ఎందుకంటే..?

పెర్త్‌ టెస్టుకు ముందు నిర్వ‌హించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో ‘ఫ్రీడమ్‌ ఈజ్‌ హ్యూమన్‌ రైట్‌.. ఆల్‌ లివ్స్‌ ఆర్‌ ఈక్వల్‌’ (స్వేచ్ఛ మానవ హక్కు. అందరి జీవితాలు సమానమే) అన్న సందేశాన్ని రాసి ఉన్న బూట్ల‌ను ఖ‌వాజా వేసుకున్నాడు. ఈ ఫోటోలు వైర‌ల్ కాగా.. ఇజ్రాయెల్‌ దాడిలో అతలాకుతులమవుతున్న పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఇలా చేస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఖ‌వాజా మాట్లాడుతూ నా బూట్లపై నేను వ్రాసినవి కొంచెం కలకలం రేపినట్లు నేను గమనించాను. అంద‌రి జీవితాలు స‌మాన‌మేన‌ని చెప్పాడు.

Baba Indrajith : నీ డెడికేష‌న్‌కు సెల్యూట్‌.. మూతికి ప్లాస్ట‌ర్ వేసుకుని.. బ్యాటింగ్ చేసిన భార‌త ఆట‌గాడు

దీనిపై బుధ‌వారం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మిన్స్ మాట్లాడుతూ.. ఆట‌గాళ్ల‌కు వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను వెల్ల‌డించే హ‌క్కు ఉంద‌న్నాడు. ఇందుకు తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నాడు. అయితే.. ఐసీసీలో కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని, వాటిని ఆట‌గాళ్లు త‌ప్ప‌కుండా పాటించాల‌ని సూచించాడు. తాను ఈ విష‌య‌మై ఇప్ప‌టికే ఖవాజాతో మాట్లాడాన‌ని, మ్యాచ్ స‌మ‌యంలో ఆ బూట్ల‌ను ధ‌రించన‌ని అత‌డు చెప్పిన‌ట్లు వెల్ల‌డించాడు.