Baba Indrajith : నీ డెడికేష‌న్‌కు సెల్యూట్‌.. మూతికి ప్లాస్ట‌ర్ వేసుకుని.. బ్యాటింగ్ చేసిన భార‌త ఆట‌గాడు

Baba Indrajith lip injury : మూతికి తీవ్ర‌మైన గాయ‌మైనప్ప‌టికీ ప్లాస్ట‌ర్ వేసుకుని వ‌చ్చిన ఓ ఆట‌గాడు త‌న బ్యాటింగ్‌తో జ‌ట్టును గెలిపించేందుకు అద్భుత పోరాటం చేశాడు.

Baba Indrajith : నీ డెడికేష‌న్‌కు సెల్యూట్‌.. మూతికి ప్లాస్ట‌ర్ వేసుకుని.. బ్యాటింగ్ చేసిన భార‌త ఆట‌గాడు

Baba Indrajith lip injury

క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును ఆదుకునేందుకు కొంద‌రు ఆట‌గాళ్లు గాయాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా బ‌రిలోకి దిగుతుండ‌డాన్ని మ‌నం కొన్ని సంద‌ర్భాల్లో చూసే ఉంటాం. కాలికి లేదా చేతికి లేదంటే త‌ల‌కు గాయ‌మైన స‌రే బ‌రిలోకి దిగిన ఆట‌గాళ్ల‌ను చూశాం. కాగా.. మూతికి తీవ్ర‌మైన గాయ‌మైనప్ప‌టికీ ప్లాస్ట‌ర్ వేసుకుని వ‌చ్చిన ఓ ఆట‌గాడు త‌న బ్యాటింగ్‌తో జ‌ట్టును గెలిపించేందుకు అద్భుత పోరాటం చేశాడు. జ‌ట్టు కోసం అత‌డు చేసిన పోరాటానికి నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. ఆ బ్యాట‌ర్ మ‌రెవ‌రో కాదు బాబా ఇంద్ర‌జిత్‌.

విజ‌య్ హ‌జారే ట్రోఫీలో భాగంగా సెమీ ఫైన‌ల్ మ్యాచులో బుధ‌వారం (డిసెంబ‌ర్ 13న‌) హ‌ర్యానా, త‌మిళ‌నాడు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన హ‌ర్యానా జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 293 ప‌రుగులు చేసింది. హ‌ర్షిత్ రాణా (116) సెంచ‌రీ చేయ‌గా యువ‌రాజ్ సింగ్ (65) హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు త‌మిళ‌నాడు జ‌ట్టు బ‌రిలోకి దిగింది.

David Warner : డేవిడ్ వార్న‌ర్ భారీ శ‌త‌కం.. మిచెల్ జాన్సెన్‌ను ఆడుకుంటున్న నెటిజ‌న్లు..

ఇన్నింగ్స్ విరామ స‌మ‌యంలో..

14వ ఓవ‌ర్‌లో 53 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ ద‌శ‌లో భీక‌ర ఫామ్‌లో ఉన్న బాబా ఇంద్ర‌జిత్ మూతికి ప్లాస్ట‌ర్ వేసుకుని బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. గ‌త రెండు ఇన్నింగ్స్‌లో అత‌డు మధ్యప్రదేశ్‌పై 92, ముంబైపై (103 నాటౌట్) శ‌త‌కం బాదాడు. 29 ఏళ్ల ఇంద్ర జిత్‌ ప‌ది బంతులు ఎదుర్కొన్న త‌రువాత చాలా అసౌక‌ర్యంగా క‌నిపించాడు. వెంట‌నే ఫిజియో మైదానంలోకి వ‌చ్చాడు. చికిత్స అనంత‌రం కాస్త కోలుకున్న ఇంద్ర‌జిత్ త‌న జ‌ట్టు కోసం నొప్పిని భ‌రిస్తూ చాలా సేపు పోరాడాడు. 71 బంతుల్లో ఐదు ఫోర్ల‌తో 64 ప‌రుగులు చేశాడు.

కాగా.. అత‌డు పోరాడిన‌ప్ప‌టికీ మిగిలిన వారు విప‌లం కావ‌డంతో త‌మిళ‌నాడు ఛేద‌న‌లో 230 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో 64 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. త‌మిళ‌నాడు జ‌ట్టులో బాబా ఇంద్ర‌జిత్ టాప్ స్కోర‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ఇన్నింగ్స్ విరామ స‌మ‌యంలో అత‌డు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. బాత్రూమ్‌లో కాలు జారి కింద‌ప‌డ‌డంతో అత‌డి పై ప‌ద‌వికి తీవ్ర‌గాయ‌మైంద‌ట‌. ఆట ముగిసిన వెంటనే ఇంద్రజిత్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి కుట్లు ప‌డిన‌ట్లు త‌మిళ‌నాడు కెప్టెన్ దినేష్ కార్తిక్ చెప్పాడు.

Out or Not out : ఔటా..? నాటౌటా..? త‌ల‌ప‌ట్టుకున్న అంపైర్లు..! జ‌ర మీరే చెప్పండి సామి..