IPL 2024 : రిష‌బ్‌పంత్, హార్దిక్ పాండ్య ఐపీఎల్ 2024 యాడ్ వీడియోలు లీక్‌..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్ కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

IPL 2024 leaked videos of Hardik and Pant of an ad shoot

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్ కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో ఈ టోర్నీ ప్ర‌చారం కోసం ప్రాంఛైజీల కెప్టెన్ల‌తో పాటు ప‌లువురు స్టార్ ఆట‌గాళ్ల‌తో ప‌లు యాడ్స్ షూట్‌ చేస్తున్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ వీడియోల్లో ముంబై ఇండియ‌న్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య‌, ఢిల్లీ సార‌థి రిష‌బ్ పంత్, కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ లు క‌నిపించారు.

షూటింగ్ స‌మ‌యం మ‌ధ్య‌లో త‌న‌కు వ‌డ్డించిన భోజ‌నం పై హార్దిక్ పాండ్య అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. అత‌డికి డోక్లా, జిలేబీని వ‌డ్డించారు. వీటిని తాను తిన‌ని హార్దిక్ పాండ్య చెప్పాడు. తాను ఫిట్‌నెస్‌ను చూసుకోవాల్సి ఉంద‌న్నాడు. ఆహారం విష‌యంలో అత‌డిని ఒప్పించేందుకు మ‌రో వ్య‌క్తి ప్ర‌య‌త్నించ‌గా తినేందుకు ఒప్పుకోలేదు.

NZ vs AUS : అది ఫీల్డ‌ర్ ప‌ట్టాల్సిన క్యాచ్‌.. గ్రౌండ్ మొత్తం నీదే అంటే ఎలా? వారి పొట్ట‌గొట్టొద్దు ప్లీజ్‌!

ఇంకో వీడియోలో.. ఏడుపు రాకుంటే ఎలా ఏడ‌వాలో చెప్పండ‌య్యా అంటూ పంత్ అస‌హ‌నానికి గురైయ్యాడు. వెంట‌నే మీ డైరెక్ట‌ర్‌ను పిల‌వండి అని అన్నాడు. ఇంకొన్ని వీడియోల్లో స్క్రిప్ట్ ఎలా గుర్తు పెట్టుకోవాల‌ని రాహుల్ అన‌గా, ధోతీ న‌చ్చ‌లేద‌ని అయ్య‌ర్ అన్నాడు. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే.. ఇది అంతా ప‌బ్లిసిటీ స్టంట్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

WPL 2024 : కేర‌ళ వ‌ర‌ద‌ల్లో స‌ర్వ‌సం పోగొట్టుకుంది.. క‌ట్ చేస్తే డ‌బ్ల్యూపీఎల్‌లో..

ట్రెండింగ్ వార్తలు