Rohit sharma : రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్.. ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!
2013 నుంచి 2023 వరకు రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. అయితే, ఉన్నట్లుండి టీం యాజమాన్యం రోహిత్ ను ...
- Harishth Thanniru
- Published On : March 19, 2024 / 01:00 PM IST
Rohit sharma
Mumbai Indians : ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రతీయేటా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బరిలోకి దిగుతూ వచ్చిన రోహిత్.. ఈసారి కేవలం ఓ ప్లేయర్ గా మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు. గతేడాది డిసెంబర్ నెలలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను యాజమాన్యం తొలగించింది. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యాను భారీ మొత్తానికి కొనుగోలు చేసి ముంబై కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, రోహిత్ శర్మను తొలగించడంపై రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తొలగించడంపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు నోరువిప్పలేదు.
Also Read : శ్రేయాస్ అయ్యర్ క్రేజ్ చూశారా.. షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు అభిమానులు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్
ఈనెల 22న ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుండగా.. 24న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండురోజుల క్రితమే ముంబై జట్టు సభ్యులతో చేరిన రోహిత్ శర్మ నెట్స్ లో ప్రాక్టీస్ ను మొదలు పెట్టాడు. రోహిత్ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో రోహిత్ శర్మ అన్ని రకాల షాట్లు ఆడాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. హిట్‌మ్యాన్ బ్యాట్ పట్టాడంటే నెమలి నాట్యం చేసినట్లు ఉంటుందంటూ ప్రశంసలజల్లు కురిపించారు.
Also Read : IPL 2024 : హార్దిక్ పాండ్యాను వదలని రోహిత్ ఫ్యాన్స్.. ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఏముందో తెలుసా?
2013 నుంచి 2023 వరకు రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. అయితే, ఉన్నట్లుండి టీం యాజమాన్యం రోహిత్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ ముంబై జట్టు తరపున ఈ ఐపీఎల్ లో ఆడనున్నాడు.
Rohit Sharma in the nets. ⭐pic.twitter.com/JHevPOr1ab
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024
