IPL 2024 : హార్దిక్ పాండ్యాను వదలని రోహిత్ ఫ్యాన్స్.. ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఏముందో తెలుసా?

రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. కెప్టెన్ గా అద్భుత ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై

IPL 2024 : హార్దిక్ పాండ్యాను వదలని రోహిత్ ఫ్యాన్స్.. ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఏముందో తెలుసా?

Hardik Pandya vs Rohit Sharma

Hardik Pandya vs Rohit sharma : ఐపీఎల్ 2024 సందడి మొదలైంది. ఈనెల 22న తొలి మ్యాచ్ జరగనుంది. ఈనెల 24న నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపనుంది. టైటాన్స్ జట్టుకు శుభ్‌మాన్ గిల్ కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గత సీజన్ లో టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం భారీ మొత్తానికి కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే, ముంబై కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై గత రెండు నెలలుగా రోహిత్ ఫ్యాన్స్ తో పాటు ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. జట్టు యాజమాన్యంపై, హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : IPL 2024 : తొమ్మిదేళ్ల తరువాత ఐపీఎల్‌లోకి పెట్టనున్న స్టార్ బౌలర్ .. బ్యాటర్లకు ఇక చుక్కలే!

రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. కెప్టెన్ గా అద్భుత ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై ముంబై జట్టు ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి ముంబై ఆటగాళ్లుసైతం నిరాశను వ్యక్తం చేశారు.

Also Read : PSL 2024 Prize Money: పాక్‌లో అంత తక్కువా..! పీఎస్ఎల్ టోర్నీలో విజేత జట్టుకు ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా?

తాజాగా ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ పాల్గొని మాట్లాడారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన అంశంపై హార్దిక్ పాండ్యా, బ్రౌచర్ లు సమాధానం చెప్పేందుకు కాస్త తబడినట్లు కనిపించింది. దీంతో హార్దిక్ పాండ్యాను లక్ష్యంగా చేసుకొని రోహిత్ ఫ్యాన్స్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో భారతదేశంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో #RIPHardikPandya అనే ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Also Read : ముంబై జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించడంపై తొలిసారి స్పందించిన హార్ధిక్ పాండ్యా