ముంబై జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించడంపై తొలిసారి స్పందించిన హార్ధిక్ పాండ్యా

రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ముంబై జట్టు అభిమానులతోపాటు, రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

ముంబై జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించడంపై తొలిసారి స్పందించిన హార్ధిక్ పాండ్యా

Hardik Pandya

Hardik Pandya : ఐపీఎల్ – 2024 సందడి మరోనాలుగు రోజుల్లో మొదలు కానుంది. ఈనెల 22న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈసారి ఐపీఎల్ లో అందరి చూపు హార్ధిక్ పాండ్యానే ఉంది. దీనికి కారణం.. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు చేపడుతుండటమే. ముంబై జట్టు యాజమాన్యం ఉన్నట్లుండి రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యాను తీసుకొచ్చి ముంబై జట్టు పగ్గాలు అప్పగించింది. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ముంబై జట్టు అభిమానులతోపాటు, రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. గత రెండు నెలలుగా రోహిత్ వర్సెస్ హార్ధిక్ పాండ్యా అన్నట్లుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ నడుస్తుంది.. ఇన్నాళ్లూ ఈ అంశంపై నోరుమెదపని హార్థిక్ పాండ్యా తాజాగా కీలక వ్యాఖ్యలుచేశారు.

Also Read : ఆర్సీబీ మహిళా జట్టును అభినందిస్తూ విజయ్ మాల్యా ట్వీట్.. ఓ ఆటాడుకున్న నెటిజన్లు

రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్. నాకు సహాయం చేసేవాడు. ఈ జట్టు ఏమి సాధించినా అది అతని ఆధ్వర్యంలోనే జరిగింది. నేను ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. నేను రోహిత్ కెప్టెన్సీలో నా కెరీర్ మొత్తం ఆడాను. అతను ఎప్పుడూ నా భుజంపై ఉంటాడని నాకు తెలుసు. అంతేకాకుండా రోహిత్ కి తనకు మధ్య వింతంగా ఏమీ జరుగుతుందని ఊహించడం లేదని హార్ధిక్ పాండ్యా చెప్పాడు. ఐపీఎల్ లో తొలుత నేను ముంబై జట్టుకే ఆడాను.. మళ్లీ ఆ జట్టుకు తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఐపీఎల్ 2024లో బౌలింగ్ చేస్తానని చెప్పాడు. అయితే, రోహిత్ శర్మ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ పై హార్ధిక్ పాండ్యా స్పందించాడు.

Also Read : ఆర్సీబీ మెన్స్ టీమ్‌పై రాజస్థాన్ రాయల్స్ ట్వీట్.. ఫుల్ కామెడీ!

నేను అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తాను. అయితే కంట్రోల్ చేయగల వ్యక్తిని మాత్రమే కంట్రోల్ చేయగలను. నేను వారిని గౌరవిస్తాను, కానీ నేను ఏమి చేయగలను అనే దానిపై దృష్టి పెడతాను అంటూ హార్ధిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు.