ఆర్సీబీ మెన్స్ టీమ్‌పై రాజస్థాన్ రాయల్స్ ట్వీట్.. ఫుల్ కామెడీ!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును అభినందిస్తూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Rajasthan Royals jethalal tweet on RCB men team
RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఫ్రాంచైజీ క్రికెట్‌లో టైటిల్ నెగ్గింది. స్మృతి మంధాన నేతృత్వంలోని మహిళల జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి ఆర్సీబీ టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో ఆర్సీబీ మెన్స్ టీమ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్ నడుస్తోంది. 16 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కొట్టలేకపోయారంటూ పురుషుల జట్టుపై సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును అభినందిస్తూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 16 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ నెగ్గేందుకు ఆర్సీబీ పురుషుల టీమ్ ఆపసోపాలు పడుతుంటే.. మహిళల జట్టు మాత్రం ఈజీగా టైటిల్ సాధించిందనే అర్థం వచ్చేలా రాజస్థాన్ రాయల్స్ ఫొటో షేర్ చేసింది. ప్రముఖ హిందీ కామెడీ టీవీ షో “తారక్ మెహతా కా ఊల్తా చష్మా”లోని ఫోటోను సందర్భానికి తగినట్టుగా వాడేసింది.
ఏంటా ఫోటో?
వంట గ్యాస్ సిలిండర్‌ను రెండు చేతులతో ఎత్తేందుకు భర్త ఆపసోపాలు పడుతుంటాడు. అతడి భార్య మాత్రం నీళ్లబిందెను మోసుకెళ్లినట్టుగా.. అవలీలగా గ్యాస్ సిలిండర్‌ను పట్టుకెళడంతో సదరు భర్త అవాక్కవుతాడు. ఈ ఫొటోను రాయల్ ఛాలెంజర్స్ ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను కూడా నెటిజనులు ట్విటర్‌లో పెట్టి సెటైర్లు వేస్తున్నారు. ఆర్సీబీ మెన్స్ టీమ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తాయి.
Congrats, @RCBTweets ?? pic.twitter.com/j0cAaNe12R
— Rajasthan Royals (@rajasthanroyals) March 17, 2024
Also Read: టైటిల్ విజేత ఆర్సీబీకి ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?
కాగా, ఈనెల 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. ఫస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తలపడనుంది.
RCB Men vs Women #WPLFinal | #RCBvsDC | #RCBWvsDCW pic.twitter.com/SSeug6m8le
— Rajabets ??? (@smileagainraja) March 17, 2024
Women’s RCB vs Men’s RCB.? pic.twitter.com/daPEqFbIKY
— Dr.Aravind Raja (@AravindRajaOff) March 17, 2024
RCB men celebrating women’s cup? pic.twitter.com/YfOrBeLUCb
— Vontari Vaadini Nenu? (@telsusir) March 17, 2024