PSL 2024 Prize Money: పాక్‌లో అంత తక్కువా..! పీఎస్ఎల్ టోర్నీలో విజేత జట్టుకు ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా?

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్టకు వచ్చే ఫ్రైజ్ మనీ కంటే.. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు

PSL 2024 Prize Money: పాక్‌లో అంత తక్కువా..! పీఎస్ఎల్ టోర్నీలో విజేత జట్టుకు ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా?

PSL Prize Money

PSL 2024 : పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024( PSL 2024) టోర్నీలో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు విజేతగా నిలిచింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఇస్లామాబాద్ యునైటెడ్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి బాల్ వరకు రెండు జట్లు విజయంకోసం పోరాడాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోపీని కైవసం చేసుకుంది. టోర్నీ అనంతరం విజేత జట్టుకు, రన్నరప్ జట్టుతోపాటు టోర్నీలో పలు విభాగాల్లో ప్రతిభకనబర్చిన క్రీడాకారులకు ఫ్రైజ్ మనీ అందజేశారు. అయితే, పీఎస్ఎల్ -2024 విజేతగా నిలిచిన జట్టుకు ఐపీఎల్ కంటే చాలా రెట్లు తక్కువ ఫ్రైజ్ మనీ లభిస్తుంది. అంతేకాదు.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విజేత జట్టుకు అందిన ప్రైజీ మనీ కంటే తక్కువ.. వాటి వివరాలను పరిశీలిస్తే..

Also Read : IPL 2024 : తొమ్మిదేళ్ల తరువాత ఐపీఎల్‌లోకి పెట్టనున్న స్టార్ బౌలర్ .. బ్యాటర్లకు ఇక చుక్కలే!

పీఎస్ఎల్ టోర్నీలో విజేతగా నిలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు సుమారు 3.5కోట్లు ఫ్రైజ్ మనీ లభించింది. అయితే, గతేడాది ఐపీఎల్ 2023 టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకుంది. ఈ జట్టు రూ.20కోట్ల పారితోషికంగా అందుకుంది. అంటే రెండు లీగ్ ల మధ్య ఛాంపియన్ జట్టుకు అందించే ప్రైజ్ మనీలో సుమారు రూ. 16.5 కోట్ల తేడాఉంది. అదేవిధంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ లో రన్నరప్ గా నిలిచిన ముల్తాన్ సుల్తాన్ జట్టుకు దాదాపు 1.4 కోట్లు ఫ్రైజ్ మనీకింద అందింది. ఐపీఎల్ 2023 టోర్నీలో రన్నరప్ జట్టు గుజరాత్ టైటాన్స్ కు రూ. 12.5 కోట్లు ఫ్రైజ్ మనీ అందించారు. దీంతో రెండు టోర్నీల మధ్య సుమారు రూ. 11కోట్లు ఫ్రైజ్ మనీలో తేడా ఉంది. ఐపీఎల్ లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 7కోట్లు, నాల్గో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 6.5 కోట్లు లభిస్తాయి. పీఎస్ఎల్ లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు ఫ్రైజ్ మనీ చాలా తక్కువ.

Also Read : పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా ఉండేందుకు నిరాకరించిన షేన్ వాట్సన్.. ఎందుకంటే?

మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్ లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్టకు వచ్చే ఫ్రైజ్ మనీ కంటే.. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఫ్రైజ్ మనీ ఎక్కువ. డబ్ల్యూపీఎల్ 2024లో విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ. 6కోట్లు ఫ్రైజ్ మనీ లభించింది. రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రూ. 3కోట్లు లభించాయి. దీన్నిబట్టి చూస్తే పాకిస్థాన్ సూపర్ లీగ్ లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ప్రైజ్ మనీ చాలా తక్కువ.