IPL 2024 : తొమ్మిదేళ్ల తరువాత ఐపీఎల్‌లోకి అడుగు పెట్టనున్న స్టార్ బౌలర్ .. బ్యాటర్లకు ఇక చుక్కలే!

ఐపీఎల్ 2024 సందడి మొదలైంది. ఈనెల 22న చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్కే) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

IPL 2024 : తొమ్మిదేళ్ల తరువాత ఐపీఎల్‌లోకి అడుగు పెట్టనున్న స్టార్ బౌలర్ .. బ్యాటర్లకు ఇక చుక్కలే!

Mitchell Starc

Kolkata Knight Riders : ఐపీఎల్ 2024 సందడి మొదలైంది. ఈనెల 22న చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్కే) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆయా జట్ల ఆటగాళ్లు తమ జట్టు శిబిరాల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే ధోనీ, కోహ్లీ లాంటి ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టేశారు. తాజాగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ లో ఆడేందుకు భారత్ కు చేరుకున్నాడు. తొమ్మిదేళ్ల తరువాత స్టార్క్ ఐపీఎల్ లో ఆడుతుండటం విశేషం. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు భారీ మొత్తాన్ని వెచ్చించి మిచెల్ స్టార్క్ ను సొంతం చేసుకుంది.

Also Read : కోహ్లీ వచ్చేశాడోచ్..! చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్

మిచెల్ స్టార్క్ 2015 ఐపీఎల్ సీజన్ లో చివరిసారిగా ఆడాడు. ఆ తరువాత ఐపీఎల్ టోర్నీకి అతను దూరమయ్యాడు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో స్టార్క్ ఆడబోతున్నాడు. స్టార్క్ తో కేకేఆర్ యాజమాన్యం రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధంగా ఐపీఎల్ వేలం చరిత్రలో మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ జరగనుంది.

Also Read : పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా ఉండేందుకు నిరాకరించిన షేన్ వాట్సన్.. ఎందుకంటే?

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ -2024 టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సందడి నెలకొంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 23న తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మిచెల్ స్టార్క్ వచ్చాడంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలను షేర్ చేసింది. దీంతో వినియోగదారులు స్టార్క్ కు స్వాగతం పలుకుతూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.