కోహ్లీ వచ్చేశాడోచ్..! చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫీల్డింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.

కోహ్లీ వచ్చేశాడోచ్..! చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్

Virat Kohli

Virat Kohli : ఐపీఎల్ 2024 సందడి మొదలైంది. ఈనెల 22న చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్కే) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మైదానంలో జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నాడు. ఆర్సీబీ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీకూడా జట్టు సభ్యులతో చేరాడు. ఆదివారం అర్థరాత్రి జట్టు సభ్యులతో చేరినకోహ్లీ సోమవారం బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్.. ఎలా అంటే?

విరాట్ కోహ్లీ వ్యక్తిగ కారణాల వల్ల కొద్దికాలంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో జరిగిన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లోనూ కోహ్లీ ఆడలేదు. కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ లండన్ లో రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.. అందుకు కోహ్లీ కొద్దికాలంగా క్రికెట్ దూరంగా ఉంటూ వస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2024లో కోహ్లీ ఆడతాడా? లేదా అనే సందేహాలుసైతం వ్యక్తమయ్యాయి. గత రెండు రోజుల క్రితమే కోహ్లీ లండన్ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు.

Also Read : ముంబై జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించడంపై తొలిసారి స్పందించిన హార్ధిక్ పాండ్యా

బెంగళూరులోని  చిన్నస్వామి స్టేడియంలో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫీల్డింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ కింగ్ కోహ్లీ వచ్చేశాడు.. ఈసారి ఆర్సీబీదే కప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాంటే ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు ఒక్కసారికూడా టైటిల్ దక్కించులేక పోయింది. తాజాగా డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా ఆర్సీబీ మహిళా జట్టు నిలిచింది. ఇప్పుడా స్ఫూర్తితో ఐపీఎల్ లోనూ పురుషుల టీమ్ చెలరేగిపోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఈసారైనా ఆర్సీబీ జట్టు ఛాంపియన్ గా నిలిస్తుందా.. మళ్లీ ఫ్యాన్స్ కు నిరాశనే మిగుల్చుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Also Read : ఆర్సీబీ మెన్స్ టీమ్‌పై రాజస్థాన్ రాయల్స్ ట్వీట్.. ఫుల్ కామెడీ!