విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్.. ఎలా అంటే?
డబ్ల్యూపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న తరువాత ఆర్సీబీ ప్లేయర్స్ కప్ అందుకొని సంబురాలు చేసుకుంటున్న ఫొటోలను ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా..

RCB Instagram account
RCB Instagram : మహిళల ప్రీమియర్ లీగ్ 2024 (డబ్ల్యూపీఎల్ 2024) టైటిల్ ను స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ మహిళా జట్టు గెలుచుకుంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. బెంగళూరులోని యువత రాత్రివేళ రోడ్లపైకి వచ్చి డ్యాన్సులు చేశారు. ఆర్సీబీ, ఆర్సీబీ అనే నినాదాలతో నగరంలోని వీధులు మారుమోగిపోయాయి. మరోవైపు ఫైనల్ లో విజయం అనంతరం ఆర్సీబీ మహిళా జట్టు ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ఇదే సమయంలో ఆర్సీబీ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన పేరిట సరికొత్త రికార్డును సృష్టించింది.
Also Read : ముంబై జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించడంపై తొలిసారి స్పందించిన హార్ధిక్ పాండ్యా
డబ్ల్యూపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న తరువాత ఆర్సీబీ ప్లేయర్స్ కప్ అందుకొని సంబురాలు చేసుకుంటున్న ఫొటోలను ఆర్సీబీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయగా.. ఈ పోస్టుకు కేవలం తొమ్మిది నిమిషాల్లోనే ఒక మిలియన్ లైక్ లు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు తొమ్మిది నిమిషాల్లోనే ఒక మిలియన్ లైకులు రావడం భారతదేశంలోని ఇన్‌స్టాగ్రామ్ చరిత్రలో ఇదే తొలిసారి. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టుకు ఒకసారి 10 నిమిషాల్లో ఒక మిలియన్ లైక్ లు వచ్చాయి. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ పెట్టిన ఓ పోస్టుకు 11 నిమిషాల్లో ఒక మిలియన్ లైక్స్ వచ్చాయి. ఆ తరువాత వరుసగా 12 నిమిషాలు, 13 నిమిషాలు, 14 నిమిషాల్లో ఒక పోస్టు కు మిలియన్ లైక్ లు వచ్చిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాదారుగా కోహ్లీ నిలిచాడు.
Also Read : ఆర్సీబీ మహిళా జట్టును అభినందిస్తూ విజయ్ మాల్యా ట్వీట్.. ఓ ఆటాడుకున్న నెటిజన్లు
https://twitter.com/mufaddal_vohra/status/1769585782363484450
https://twitter.com/Cricketracker/status/1769612372615024943?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Etweet