IPL 2024 : రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెష‌న్‌లో ఏం చేశారో చూడండి.. మీరూ నవ్వాపుకోలేరు.. వీడియో వైరల్

రోహిత్ శర్మ, రిషబ్ పంత్ మధ్య మంచి స్నేహం ఉంది. గ్రౌండ్ లోనే కాకుండా డ్రెస్సింగ్ రూంలో కూడా రోహిత్ శర్మ తోటి ప్లేయర్స్ తో జోకులు వేస్తూ సరదాగా ఉంటాడు.

Rohit Sharma and Rishabh Pant

MI vs DC IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ముంబై జట్టు వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఢిల్లీపై జరిగే మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఆ జట్టు ప్లేయర్స్ పట్టుదలతో ఉన్నారు. అయితే, ప్రాక్టీస్ సెషన్ లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఇద్దరూ ప్రాక్టీస్ సెషన్ లో కలుసుకున్నారు. వారు పలు విషయాలపై మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు గులాబీ జెర్సీ ఎందుకు వేసుకున్నారో తెలుసా?

రోహిత్ శర్మ, రిషబ్ పంత్ మధ్య మంచి స్నేహం ఉంది. గ్రౌండ్ లోనే కాకుండా డ్రెస్సింగ్ రూంలో కూడా రోహిత్ శర్మ తోటి ప్లేయర్స్ తో జోకులు వేస్తూ సరదాగా ఉంటాడు. రిషబ్ పంత్ సైతం అదేతరహాలో ఉంటాడు. వీరి కలిసినప్పుడల్లా అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. తాజాగా మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్ సమయంలో రోహిత్ శర్మ వద్దకు పంత్ వెళ్లాడు. రోహిత్ శర్మను కౌగిలించుకున్నాడు. అనంతరం వారిద్దరూ ఏదో విషయంపై మాట్లాడుతూ కనిపించారు. ఆ సమయంలో రోహిత్ క్యాచ్ తీసుకున్నట్లుగా వ్యవమరిస్తూ నవ్వడం ప్రారంభించాడు. పంత్ సైతం నవ్వుతూ కనిపించారు. వీరు స్టేడియంలో సరదాగా కలిసున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు.. రోహిత్, పంత్ ఇద్దరూ హార్దిక్ పాండ్యాను హేళను చేస్తూ నవ్వుకుంటున్నట్లుగా ఉందంటూ పేర్కొన్నారు.

Also Read : రోహిత్ శర్మ పాదాలను తాకిన మహిళా అభిమాని.. హిట్‌మ్యాన్‌ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి టీమిండియా జట్టుకు దూరమయ్యాడు. అంతేకాక, గత రెండు ఐపీఎల్ సీజన్స్ కూడాదూరంగా ఉన్నాడు. పంత్ గాయాల నుంచి కోలుకోవటంతో ఐపీఎల్ 2024 సీజన్ లో డీసీ కెప్టెన్ గా మైదానంలో దిగాడు. బ్యాటింగ్ రాణిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ లలో పంత్ రెండు ఆఫ్ సెంచరీలు చేశాడు. అయితే, నాలుగు మ్యాచ్ లలో ఢిల్లీ జట్టు మూడు మ్యాచ్ లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్ లో ముంబై జట్టుపై గెలవాలని ఆ జట్టు ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. మరి ముంబై, డీసీ జట్లలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.

 

 

 

ట్రెండింగ్ వార్తలు