IPL 2024 : జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2024లో ఎనిమిది మ్యాచ్‌ల‌లో ఎన్ని డాట్ బాల్స్ వేశాడో తెలుసా?

ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ...

Jasprit Bumrah

IPL 2024 Most dot balls : ఐపీఎల్ 2024 సీజన్ లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో స్కోర్లు నమోదవుతున్నాయి. యువ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. అనుభవం ఉన్న బౌలర్లుసైతం భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. పలువురు బౌలర్లు సరికొత్త వ్యూహాలతో బాల్స్ సంధిస్తూ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. వారిలో జస్ర్పీత్ బుమ్రా కూడా ఒకరు. బుమ్రా ఈ ఐపీఎల్ సీజన్ లో యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు.

Also Read : IPL 2024 : సెంచరీతో చెలరేగిన యశస్వి.. ముంబైపై రాజస్తాన్ ఘన విజయం

ఐపీఎల్ 2024 సీజన్ లో బ్యాటర్ల హవా సాగుతుండగా.. వారిని కట్టడిచేస్తూ అత్యధిక డాట్ బాల్స్ వేసిన ఐదుగురు బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా కూడా ఉన్నారు. ఈ విభాగంలో తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్ ఖలీల్ అహ్మద్ ఉన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ఖలీల్ 31 ఓవర్లు వేశాడు. 10 వికెట్లు పడగొట్టి 280 పరుగులు ఇచ్చాడు. అయితే, ఖలీల్ అహ్మద్ 87 డాట్ బాల్స్ వేశాడు.

పంజాబ్ కింగ్స్ జట్టు బౌలర్ కగిసో రబడ అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఎనిమిది మ్యాచ్ లు ఆడిన అతడు 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. పది వికెట్లు పడగొట్టి 273 పరుగులు ఇచ్చాడు. అతను 83 డాట్ బాల్స్ వేశాడు.

Also Read : Virat Kohli : బ్రేకింగ్‌.. విరాట్ కోహ్లికి బిగ్ షాకిచ్చిన‌ బీసీసీఐ..

ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన బుమ్రా 32 ఓవర్లు వేశాడు. 204 పరుగులు ఇచ్చి 13 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 80కిపైగా డాట్ బాల్స్ వేశాడు.

చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ తుషార్ దేశ్ పాండే అద్భుతమైన బౌలింగ్ తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో తుషార్ దేశ్ పాండే నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అతను ఏడు మ్యాచ్ లు ఆడగా 26 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 69 డాట్ బాల్స్ వేశాడు. దీంతో 216 పరుగులకు ఆరు వికెట్లు తీశాడు.

అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో ట్రెంట్ బౌల్డ్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ లు ఆడగా 24 ఓవర్లు వేశాడు. 117 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇతను 68 డాట్ బాల్స్ వేశాడు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు