IPL 2024 : సెంచరీతో చెలరేగిన యశస్వి.. ముంబైపై రాజస్తాన్ ఘన విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

IPL 2024 : సెంచరీతో చెలరేగిన యశస్వి.. ముంబైపై రాజస్తాన్ ఘన విజయం

Updated On : April 22, 2024 / 11:55 PM IST

IPL 2024 : ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. 9 వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల టార్గెట్ ని రాజస్తాన్ 18.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది.

రాజస్తాన్ బ్యాటర్ యశస్తి జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్ 60 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. జోస్ బట్లర్ (35), సంజూ శాంసన్ (38*) పరుగులు చేశారు. వరుస విజయాలతో రాజస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది.