Sanju Samson : వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో విఫ‌లం.. సంజూ శాంస‌న్ పై సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ హాట్ కామెంట్స్‌.. కాస్త ఓపిక..

వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లోనూ సంజూ శాంస‌న్‌ (Sanju Samson) విఫ‌లం అయ్యాడు.

IPL 2026 CSK vs PBKS Stephen Fleming comments on Sanju Samson

  • ఐపీఎల్ 2026 ముందు ఆర్ఆర్ నుంచి చెన్నైలోకి వ‌చ్చిన సంజూ శాంస‌న్‌
  • వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో విఫ‌లం
  • అయినా గానీ సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స‌పోర్టు

Sanju Samson : ఐపీఎల్ 2026 వేలం క‌న్నా ముందు ట్రేడింగ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులోకి వ‌చ్చాడు సంజూ శాంస‌న్‌. ఇక టీమ్ఇండియా త‌రుపున టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడ‌డంతో ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో సీఎస్‌కే అత‌డి పై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఓపెన‌ర్‌గా మెరుపు ఆరంభాల‌ని అందిస్తాడ‌ని ఆశ‌ప‌డింది. క‌ట్ చేస్తే.. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లోనూ శాంస‌న్ విఫ‌లం అయ్యాడు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 6 ప‌రుగులు మాత్ర‌మే చేసిన సంజూ శాంస‌న్ శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో సంజూ శాంస‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

Ruturaj Gaikwad : మేం ఓడిపోయింది అందుకే.. మా బౌల‌ర్లు ఉన్నారే.. రుతురాజ్ గైక్వాడ్ కామెంట్స్‌..

సంజూ శాంస‌న్ విష‌యంలో కాస్త ఓపిక‌గా ఉండాల‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. అత‌డి ఫామ్ పై త‌మ‌కు ఎలాంటి సందేహం లేద‌న్నాడు. అత‌డు ప్ర‌తిసారి ప‌రుగులు చేయ‌లేడ‌ని చెప్పుకొచ్చాడు. ఇది టీ20 క్రికెట్ అని ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం అన్నాడు. సంజూ ఒక్క‌సారి కుదురుకుంటే అత‌డిని ఆప‌డం క‌ష్ట‌మ‌న్నాడు. అత‌డు మ్యాచ్ విన్న‌ర్ అని చెప్పుకొచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫ‌ల‌మైనంత మాత్రాన ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నాడు.

వ‌రుస‌గా రెండో ఓట‌మి..

ఐపీఎల్ 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. శుక్ర‌వారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 209 ప‌రుగుల భారీ స్కోరు సాధించిన‌ప్ప‌టికి కూడా కాపాడుకోలేక‌పోయింది.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో ఆయుష్ మాత్రే (73; 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), శివ‌మ్ దూబె (45 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (32; 12 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో విజయకుమార్ వైశాఖ్ రెండు, జేవియర్ బార్ట్‌లెట్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

Shreyas Iyer : అందుక‌నే చాహ‌ల్‌కు పూర్తి ఓవ‌ర్ల కోటా ఇవ్వ‌లేదు.. నాకు మైదానంలో డౌట్ వ‌స్తే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్

210 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ (50; 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కం బాదాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రియాన్ష్ ఆర్య (39; 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)లు రాణించారు. చెన్నై బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ లు చెరో రెండు వికెట్లు తీశారు.