Shubman Gill : ఢిల్లీ పై విజ‌యం.. గుజ‌రాత్ టైటాన్స్‌కు బిగ్‌ షాక్‌.. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌కు భారీ జ‌రిమానా..

గెలుపు జోష్‌లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. కెప్టెన్ గిల్‌కు (Shubman Gill) రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది.

IPL 2026 DC vs GT match Gujarat Titans skipper Shubman Gill fined 12 lakh (pic credit@ipl)

  • ఢిల్లీతో మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్‌రేటును న‌మోదు చేసిన గుజ‌రాత్
  • ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్‌కు ఇదే తొలిసారి
  • కెప్టెన్ శుభ్‌మ‌న్‌కు జ‌రిమానా విధించిన ఐపీఎల్ నిర్వాహ‌కులు

Shubman Gill : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఎట్ట‌కేల‌కు గెలుపు బోణీ కొట్టింది. బుధ‌వారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 1 ప‌రుగు తేడాతో విజ‌యం సాధించింది. కాగా.. గెలుపు జోష్‌లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. కెప్టెన్ గిల్‌కు రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు సాధించింది. జీటీ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (45 బంతుల్లో 70 ప‌రుగులు), జోస్ బ‌ట్ల‌ర్ (27 బంతుల్లో 52 ప‌రుగులు ), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (32 బంతుల్లో 55 పరుగులు) అర్థ‌శ‌త‌కాలు చేశారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీయ‌గా.. లుంగి ఎంగిడి, కుల్దీప్ యాద‌వ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

డేవిడ్‌ మిల్ల‌ర్ ఎంత ప‌ని చేస్తివి.. కుల్దీప్ ఉన్నాడ‌నే అలా చేశావా.. ఇప్పుడు చూడు..

అనంత‌రం 211 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92 ప‌రుగులు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా.. పాతుమ్ నిస్సాంక (24 బంతుల్లో 41 ప‌రుగులు), డేవిడ్ మిల్ల‌ర్ (20 బంతుల్లో 41 నాటౌట్) రాణించారు. జీటీ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ మూడు, ప్ర‌సిద్ధ్ కృష్ణ రెండు, సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.

గిల్‌కు జ‌రిమానా..

ఢిల్లీతో మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేటును (నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్ల‌ను పూర్తి చేయ‌క‌పోవ‌డం) న‌మోదు చేసింది. ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ తొలిసారి ఈ త‌ప్పిదానికి పాల్ప‌డ‌డంతో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌కు జ‌రిమానా ప‌డింది. 12 ల‌క్ష‌ల ఫైన్ ను ఐపీఎల్ నిర్వాహ‌కులు విధించారు.

క‌న్నీళ్లు పెట్టుకున్న డేవిడ్ మిల్ల‌ర్‌.. అక్ష‌ర్ ప‌టేల్ చేసిన ప‌నికి స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు.. నువ్వు నిజ‌మైన కెప్టెన్‌ సామీ..

‘ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోని14వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేసినందుకు ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించాం. కనీస ఓవర్ రేట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సీజన్‌లో ఆ జట్టు చేసిన మొదటి ఉల్లంఘన ఇది. దీంతో గిల్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించాం.’ అని ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.