David Miller : మ్యాచ్ ఓడిపోయినా ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ అరుదైన ఘ‌న‌త‌

ఆర్‌సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ (David Miller) అరుదైన ఘ‌నత సాధించాడు.

IPL 2026 DC vs RCB David Miller completes 12000 t20runs

  • టీ20 క్రికెట్‌లో డేవిడ్ మిల్ల‌ర్ అరుదైన ఘ‌న‌త‌
  • 12 వేల ప‌రుగుల మైలురాయి
  • ఈ ఘ‌న‌త సాధించిన మూడో ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్

David Miller : ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ అరుదైన ఘ‌నత సాధించాడు.

టీ20 క్రికెట్‌లో 12 వేల ప‌రుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 11 ప‌రుగుల వ‌ద్ద అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మిల్ల‌ర్ మొత్తంగా 18 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 19 ప‌రుగులు సాధించాడు.

Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్‌కు షాకిచ్చిన మిచెల్ సాంట్న‌ర్‌.. ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్‌తో ఎంఐ డీల్..

టీ20 క్రికెట్‌లో 12వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న మూడో ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్‌గా మిల్ల‌ర్ రికార్డుల‌కు ఎక్కాడు. అత‌డి క‌న్నా ముందు ఫాఫ్ డుప్లెసిస్ (431 మ్యాచ్‌లలో 137కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఎనిమిది సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలతో 12,041 పరుగులు), క్వింటన్ డికాక్ (442 మ్యాచ్‌లలో 139కు పైగా స్ట్రైక్ రేట్‌తో తొమ్మిది సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలతో 12,454 పరుగులు) లు మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు.

ఇక డేవిడ్ మిల్ల‌ర్ విష‌యానికి వ‌స్తే.. అత‌డు 565 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 513 ఇన్నింగ్స్‌ల్లో 12008 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు శ‌త‌కాలు ఉన్నాయి.

ఇక టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్ గేల్ పేరిట ఉంది. అత‌డు 463 మ్యాచ్‌ల్లో 455 ఇన్నింగ్స్‌ల్లో 144.75 స్ట్రైక్‌రేటుతో 14562 ప‌రుగులు చేశాడు. ఇందులో 22 సెంచ‌రీలు, 88 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 175 నాటౌట్‌.

Axar Patel : బెంగ‌ళూరు పై ఘోర ఓట‌మి.. అక్ష‌ర్ ప‌టేల్ హాట్ కామెంట్స్‌.. ఏం జ‌రిగిందో ఇంకా అర్థం కావ‌డం లేదు.. ఆశ్చ‌ర్య‌పోయా..

ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో డేవిడ్ మిల్ల‌ర్ 7 మ్యాచ్‌లు ఆడాడు. 41 స‌గ‌టు 146.62 స్ట్రైక్‌రేటుతో 123 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 41 నాటౌట్‌.