Shubman Gill : టీ20ల్లో శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త‌.. కోహ్లీ రికార్డు బ్రేక్‌..

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

IPL 2026 GT vs CSK Shubman Gill completes 6000 T20 runs (pic credit@ipl)

  • టీ20ల్లో శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త‌
  • 6వేల ప‌రుగుల మైలురాయి
  • ఈ ఘ‌న‌త అత్యంత వేగంగా సాధించిన రెండో భార‌తీయుడిగా రికార్డు

Shubman Gill : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20ల్లో 6వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. గురువారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌తను సాధించాడు. ఈ క్ర‌మంలో కేఎల్ రాహుల్ త‌రువాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల) ప‌రంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. కేఎల్ రాహుల్ 166 ఇన్నింగ్స్‌ల్లో టీ20ల్లో 6 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకోగా, గిల్ 185వ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

ఇక ఓవ‌రాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆట‌గాళ్ల జాబితాలో గిల్ ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. గేల్ 162 ఇన్నింగ్స్‌ల్లోనే టీ20ల్లో 6వేల ప‌రుగుల క్ల‌బ్‌ను చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో బాబ‌ర్ ఆజామ్‌, రాహుల్‌, షాన్ మార్ష్‌, కాన్వే, విరాట్ కోహ్లీలు ఉన్నారు.

Chennai Super Kings : ఐపీఎల్ నుంచి ఔట్‌.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్‌తో పాటు ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు భారీ జ‌రిమానా..

టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల ప‌రంగా) 6వేల ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* క్రిస్ గేల్ – 162 ఇన్నింగ్స్‌ల్లో
* బాబ‌ర్ ఆజామ్ – 165 ఇన్నింగ్స్‌ల్లో
* కేఎల్ రాహుల్ – 166 ఇన్నింగ్స్‌ల్లో
* షాన్ మార్ష్ – 180 ఇన్నింగ్స్‌ల్లో
* డేవాన్ కాన్వే – 180 ఇన్నింగ్స్‌ల్లో
* విరాట్ కోహ్లీ – 184 ఇన్నింగ్స్‌ల్లో

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. శుభ్‌మ‌న్ గిల్ (64; 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో పాటు సాయి సుద‌ర్శ‌న్ (84; 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), జోస్ బ‌ట్ల‌ర్ (57 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 229 ప‌రుగులు చేసింది. చెన్నై బౌల‌ర్ల‌లో ముకేశ్ చౌద‌రి, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

Rohit Sharma : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 నుంచి రోహిత్ శ‌ర్మ ఔట్‌? హిట్‌మ్యాన్ భ‌విత‌వ్యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న బీసీసీఐ!

ఆ త‌రువాత 230 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో చెన్నై 13.4 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో గుజ‌రాత్ 89 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.