×
Ad

IPL 2026 : ఐపీఎల్ 2026.. ఏ ఫ్రాంఛైజీ ఖాతాలో ఎంత సొమ్ము ఉంది.. ఎంత మంది ప్లేయర్లను కొనుగోలు చేయొచ్చు.. ఫుల్ డీటెయిల్స్

IPL 2026 : ఆటగాళ్ల రిటెన్షన్, బదిలీ తరువాత ఏ జట్టు యాజమాన్యం వద్ద ఎంత డబ్బు ఉంది..? ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది..

IPL 2026

IPL 2026 auction purse : ఐపీఎల్ -2026కు రంగం సిద్ధమవుతోంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చిన ప్రక్రియ పూర్తయింది. శనివారంతో ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్‌కు గడువు ముగిసింది. దీంతో ప్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను వదిలేసుకోగా.. మరికొందరు బదిలీ అయ్యారు.

ఐపీఎల్ 2026 వేలానికి (IPL 2026) ముందు రిటైన్ చేసుకునే, విడుద‌ల చేసే ఆట‌గాళ్ల జాబితాల‌ను అన్ని ఫ్రాంఛైజీలు ప్ర‌క‌టించాయి. డిసెంబరు 15న అబుదాబి వేదిక‌గా మినీ వేలం జరగనుంది. అయితే, ఆటగాళ్ల రిటెన్షన్, బదిలీ తరువాత ఏ జట్టు యాజమాన్యం వద్ద ఎంత డబ్బు ఉంది.. ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Also Read: IPL 2026 : ఐపీఎల్ 2026 రిటెన్షన్‌, రిలీజ్ పూర్తి లిస్ట్ ఇదే.. ఏ జ‌ట్టు ఎవ‌రిని వ‌దిలివేసింది, ఎవ‌రిని అట్టిపెట్టుకుందంటే..?

ఏ జట్టు వద్ద ఎంత డబ్బు ఉంది.. ఎన్ని ఖాళీలు ఉన్నాయి వివరాలు ఇవే .
♦ చెన్నై సూపర్ కింగ్స్ : రూ.43.40 కోట్లు (9 మంది.. అందులో నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు).
♦ ఢిల్లీ క్యాపిటల్స్ : రూ. 21.80 కోట్లు (8మంది.. ఐదుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
♦ గుజరాత్ టైటాన్స్ : రూ.12.90 కోట్లు(మొత్తం5 గురు.. నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
♦ కోల్‌కతా నైట్‌రైడర్స్ : రూ. 64.30 కోట్లు (13 మంది.. ఆరుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
♦ లక్నో సూపర్ జెయింట్స్ : రూ. 22.95కోట్లు (6 మంది.. నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)
♦ ముంబై ఇండియన్స్ : రూ.2.75కోట్లు (5 మందికి.. ఒక విదేశీ ప్లేయర్‌కు చోటు)
♦ పంజాబ్ కింగ్స్ : రూ. 11.50 కోట్లు (4 మంది.. ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)
♦ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 16.40 కోట్లు (8మంది ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)
♦ రాజస్థాన్ రాయల్స్ : రూ.16.05 కోట్లు  (9మంది.. ఒక విదేశీ ప్లేయర్‌కు చోటు)
♦ సన్ రైజర్స్ హైదరాబాద్ : రూ.25.50 కోట్లు (10 మంది.. ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 23.75 కోట్లు), వెస్టిండీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ ( 12 కోట్లు)ను వదులుకోవడంతో కోల్‌కతా ఖాతాలో అన్ని ఫ్రాంఛైజీల కంటే ఎక్కువ సొమ్ము (రూ. 64.3కోట్లు) ఉంది. ఆ తరువాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (రూ.43.40 కోట్లు)తో నిలిచింది. ముంబై ఇండియన్స్ వద్ద కేవలం 2.75కోట్లు మాత్రమే ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం అత్యధికంగా 13మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. ఆ తరువాత స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది.