KKR vs LSG : ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో వర్సెస్ కేకేఆర్.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే..
గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ (KKR vs LSG ) తలపడనుంది.
- Thota Vamshi Kumar
- Published On : April 9, 2026 / 02:44 PM IST
IPL 2026 KKR vs LSG head to head records Match Prediction (pic credit@ipl)
- నేడు కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్
- ఈడెన్ గార్డెన్స్ వేదికగా
- ఇంత వరకు గెలుపు బోణీ కొట్టని కేకేఆర్
- రెండో విజయం కోసం లక్నో ఆరాటం
KKR vs LSG : ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గురువారం మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గారెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోగా మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. రెండు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్ రేటు -0.542గా ఉంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
రాజస్థాన్ రాయల్స్‌తో ఆర్‌సీబీ మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డు ఇదే..
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆ జట్టు గెలుపు బోణీ కొట్టలేదు. ఇప్పటి వరకు కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. రెండింటిలో ఓడిపోయింది. వర్షం వల్ల పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ఖాతాలో ఓ పాయింట్ వచ్చి చేరింది. ఆ జట్టు రన్‌రేటు -1.964గా ఉంది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు బోణీ కొట్టాలని కేకేఆర్ ఆరాటపడుతోంది.
హెడ్-టు-హెడ్ రికార్డులు..
కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటి వరకు 6 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 4 మ్యాచ్‌ల్లో లక్నో విజయం సాధించగా మరో రెండు మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది.
తుది జట్ల అంచనా..
కోల్‌కతా నైట్ రైడర్స్..
అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్/రోవ్‌మన్ పావెల్, వరుణ్ చక్రవర్తి/నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి
లక్నో సూపర్ జెయింట్స్ ..
ఐడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
