IPL 2026 : గెలిచే మ్యాచ్ ఓడాం.. వాళ్లవల్లే ఇదంతా.. నా తప్పు కూడా ఉంది.. రిషబ్ పంత్ కీలక కామెంట్స్..
IPL 2026 : గెలిచే మ్యాచ్‌లో ఓడిపోవటంపై లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ జట్టు ఓటమికి గల కారణాలపై కీలక కామెంట్స్ చేశారు.
- Harishth Thanniru
- Updated on- April 23, 2026 / 07:00 AM IST
Rishabh Pant
- రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో ఓటమి
- 40 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో జట్టు
- ఓటమికి కారణాలపై కెప్టెన్ రిషబ్ పంత్ కీలక కామెట్స్
IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 18ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమిపాలైంది. గెలిచే మ్యాచ్ లో ఓడిపోవటంపై లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ జట్టు ఓటమికి గల కారణాలపై కీలక కామెంట్స్ చేశారు.
Also Read : IPL 2026: వాటే మ్యాచ్.. లక్నోపై రాజస్థాన్ ఘన విజయం
చెత్త బ్యాటింగే మా ఓటమికి ప్రధాన కారణం. తనతోపాటు బ్యాటర్లంతా విఫలమయ్యారు. బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు ఎక్కువ పరుగులు చేయకుండా కట్టడి చేసినా.. మేము చెత్త బ్యాటింగ్ తో గెలిచే మ్యాచ్ లో ఓడిపోయాం. ఈ ఓటమి గురించి మాట్లాడటం చాలా కష్టంగా ఉంది. కచ్చితంగా మా చెత్త బ్యాటింగే ఈ ఓమికి ప్రధాన కారణం. ఈ ఓటమి పట్ల జట్టుగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నాం అని రిషబ్ పంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
🚨 RAJASTHAN ROYALS DEFENDED THE LOWEST EVER TOTAL OF IPL 2026. 🚨
– A top 2 entry for Riyan Parag’s boys!! 🔝 pic.twitter.com/zLNnvxkxxz
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2026
బ్యాటింగ్ సమయంలో మేము కాస్త టైమ్ తీసుకొని ఆడాల్సింది. ఈ ఓటమికి నేను ఏ సాకు చెప్పదల్చుకోలేదు. నాతో సహా మేమంతా ఆ తప్పు చేశాం. మ్యాచ్ ను ఇంకాస్త చివరి వరకు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్ విభాగం బాధ్యత తీసుకొని బౌలర్ల కోసం ఈ మ్యాచ్ గెలవాల్సింది. కానీ, మేము ఆ మేరకు రాణించలేకపోయాం. అయితే, మేం పుంజుకోవడానికి మార్గాలను వెతుక్కోవాలి. జట్టు లోపాలపై పరిష్కారాలు కొనుగొనాలి. ప్రస్తుతం మా పరిస్థితి బాగాలేదు. మా బలహీనతలను సరిదిద్దుకోవాలి. మా బౌలింగ్, బ్యాటింగ్ లో ఫైర్ పవర్ ఉంది. మేము ఖచ్చితంగా పుంజుకుంటామని నమ్మకం నాకుంది అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.
The brilliance of Dhruv Jurel behind the stumps.
– Jofra Archer and Riyan Parag were totally impressed. 😄🔥 pic.twitter.com/ehPRVohvYO
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2026
