IPL 2026: వాటే మ్యాచ్.. లక్నోపై రాజస్థాన్ ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది.
IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ దుమ్ము రేపింది. ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. లో స్కోర్ చేసినా అద్భుతంగా ఆడింది రాజస్తాన్. ఆ జట్టు బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో..119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో 40 పరుగుల తేడాతో రాజస్తాన్ విక్టరీ కొట్టింది. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో మెరిశాడు. బర్గర్, శర్మ తలో రెండు వికెట్లు తీశారు. జడేజా, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్ లో లక్నోకి ఇది వరుసగా నాలుగో పరాజయం. అటు రెండు వరుస ఓటముల తర్వాత రాజస్తాన్ మళ్లీ గెలుపు బాట పట్టింది.
